RRR లో ఈ కర్మ సిధ్ధాంతాన్ని గమనించారా..?

RRR లో ఈ కర్మ సిధ్ధాంతాన్ని గమనించారా..?

by Anudeep

Ads

భారతీయ మతాల్లో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి.

Video Advertisement

కర్మ అంటే మానసికంగా గాని, శారీరకంగా గాని చేసింది. ఎవరు చేసిన పాపం లేదా పుణ్యం వారు ఒంటరిగా, స్వంతంగా అనుభవించాలి. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీలో కూడా కర్మ సిద్ధాంతాన్ని చెప్పారు రచయిత విజయేంద్ర ప్రసాద్.

తన స్నేహితుడు భీమ్‌ (ఎన్టీఆర్)ని వెన్నుపోటు పొడిచినందుకు గాను ఒక పోరాట సన్నివేశంలో రామరాజుకు (రామ్ చరణ్) వీపులోకి చెట్టుకి చువ్వలా వుండే మొద్దు దిగుతుంది. రామరాజు తన స్నేహితుడు భీమ్‌ని బ్రిటిష్ వారి ముందు మోకరిల్లేలా చేయడానికి మోకాళ్లపై ఎలా అయితే కొడతాడో బ్రిటిష్ సైన్యం అదుపులో ఉన్నప్పుడు రామరాజుని అలాగే మోకాళ్ల కొడతారు.

అలాగే భీమ్ ఫ్రెండ్ లచ్చు (రాహుల్ రామకృష్ణ) ను మోకాళ్ళపై కొట్టాడు. రామరాజు భీమ్ ను ఎలా శిక్షించాడో అదే శిక్షను పొందాడు. నిజానికి రామ్ తన స్నేహితుడిని చాలా ప్రేమిస్తున్నాడు. కావాలని ఇదంతా చేయలేదు. అతను తన తండ్రికి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి బరువెక్కిన హృదయంతో భీమ్ ను కొట్టాడు.

అతని లక్ష్యం మంచిదే. అతను మంచి వ్యక్తి. అయినప్పటికీ అతను “కర్మ” నుండి తప్పించుకోలేడు. మీరు మంచివారైనా, చెడ్డవారైనా ప్రతి ఒక్కరూ మీ “కర్మ”ని ఎదుర్కోక తప్పదు అనే నీతిని ఈ సీన్ మనకు నేర్పుతుంది.


End of Article

You may also like