Ads
ఇటీవల కెంపేగౌడ అనే ఒక రైతు తన స్నేహితులతో కలిసి కారుని కొనడం కోసం మహీంద్రా కార్ షోరూమ్ కి వెళ్ళాడు. అయితే అతను వేసుకున్న దుస్తుల్ని చూసి షోరూం సేల్స్ మెన్ అతనిని అవమానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Video Advertisement
ఈ వీడియోలో ఓ రైతు కారు కొనడానికి తన స్నేహితులతో కలిసి మహీంద్రా షోరూమ్‌కి వెళ్లారు. అయితే, అతని వస్త్రధారణ వల్ల సేల్స్ మ్యాన్ అతన్ని దూషించారు. ఈ ఘటనపై రైతు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు.
షోరూమ్ ఫీల్డ్ ఆఫీసర్ తనను, తన వేషధారణను ఎగతాళి చేశారని ఆ రైతు ఆరోపించారు. తనను వెక్కిరించడమే కాకుండా.. కార్ ఏమీ పది రూపాయల వస్తువు కాదంటూ హేళన చేసారు అంటూ రైతు తన ఆవేదనని చెప్పుకున్నారు. కారు కొనేందుకు ఇంత మంది కలిసి రారు అంటూ సదరు సేల్స్ మ్యాన్ అన్నాడని పేర్కొన్నారు.
దీనితో అవమానానికి గురి అయిన ఆ రైతు గంట వ్యవధిలోనే పదిలక్షల రూపాయలను తీసుకొచ్చి కార్ ను డెలివర్ చేయాలంటూ డిమాండ్ చేసాడు. ఇందుకోసం, ఆ రైతు తన స్నేహితుల సాయం తీసుకున్నాడు. అతని చర్యకి షో రూమ్ సిబ్బంది షాక్ అయ్యారు. మూడు రోజుల్లో కారు డెలివరీ చేస్తామని రైతుకు, అతని స్నేహితుడికి సమాచారం అందించారు.
ఆ తర్వాత, షోరూమ్ సిబ్బందిపై అసభ్యంగా ప్రవర్తించినందుకు మరియు తనను అవమానించినందుకు కెంపేగౌడ తుమకూరులోని తిలక్‌నగర్ పోలీస్ స్టేషన్లో పోలీసు ఫిర్యాదు కూడా నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో షోరూం సేల్స్‌మెన్, ఇతర ఉద్యోగులు కెంపేగౌడకు క్షమాపణలు చెప్పడంతోపాటు చేతితో రాసిన క్షమాపణ లేఖ కూడా ఇచ్చారు. క్షమాపణలు చెప్పడంతో పోలీసులు కేసును సామరస్యంగా పరిష్కరించారు.
End of Article