Ads
మొదటి కార్తీకదీపం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కార్తీకదీపం 2 సీరియల్ కూడా ప్రసారం అవుతోంది. ఈ సీరియల్ కి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్కతో పాటు ఒక అమ్మాయి కూడా కనిపిస్తోంది. దీప కూతురు శౌర్య పాత్రలో ఈ అమ్మాయి నటిస్తోంది. ఈ అమ్మాయి పేరు చైత్ర లక్ష్మి. ఇంత చిన్న వయసులోనే తన నటనతో ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. సీరియల్ లో హీరో, హీరోయిన్ తో సమానంగా ఈ చిన్న పాపకి కూడా పేరు వస్తోంది. గతంలో చైత్ర లక్ష్మి, కుంకుమపువ్వు, రాధకు నీవేర ప్రాణం సీరియల్స్ లో నటించింది.
Video Advertisement
నాని హీరోగా నటించిన దసరా సినిమాలో నటించింది. ఇప్పుడు కార్తీకదీపం 2 సీరియల్ తో ప్రేక్షకులని అలరిస్తోంది. చైత్ర లక్ష్మి తల్లిదండ్రులు వినలేరు. మాట్లాడలేరు. ఈ విషయాన్ని చైత్ర లక్ష్మి ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. చైత్ర లక్ష్మి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చింది. సరదాగా మాట్లాడుతూ తన గురించి ఎన్నో విషయాలు ఈ ఇంటర్వ్యూలలో చెప్పింది. దాంతో ఈ ఇంటర్వ్యూలు చాలా ఫేమస్ అయ్యాయి. ఒక ఇంటర్వ్యూలో, తన తల్లిదండ్రుల గురించి ఈ విషయం చెప్పింది. “అమ్మకి నాన్నకి మాటలు రావాలి అని దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. పూజ చేస్తాను.”
“ఆ దేవుడిని మా అమ్మానాన్నలకి మాటలు రావాలి అని కోరుకుంటున్నాను” అంటూ మాట్లాడింది. అయితే, “మీ అమ్మా నాన్నని ఇలా పుట్టించినందుకు దేవుడి మీద నీకు కోపం రాలేదా?” అని అడిగిన ప్రశ్నకి ఈ అమ్మాయి, “అలా ఏం లేదు. ఎందుకంటే, వాళ్లు మాట్లాడాల్సిన మాటలు కూడా నేనే మాట్లాడేస్తున్నాను కదా?” అని చెప్పింది. చైత్ర లక్ష్మి బాగోగులు ఆమె అమ్మమ్మ, తాతయ్య చూసుకుంటున్నారు. చైత్ర లక్ష్మి తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. కానీ వారితో పాటు అమ్మమ్మ, తాతయ్య కూడా ఉంటున్నారు.
చైత్ర లక్ష్మి సినిమాల వైపు రావడానికి అమ్మమ్మ, తాతయ్యలు ప్రోత్సహించారు. అమ్మమ్మ బంధువుల ద్వారా సీరియల్స్ లో అవకాశం వచ్చింది. దసరా సినిమాలో నటన చూసి కుంకుమపువ్వు సీరియల్ లో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత రాధకి నీవేర ప్రాణం సీరియల్ లో అవకాశం వచ్చింది. తల్లి తండ్రి మాట్లాడలేరు కాబట్టి వాళ్లతో సైగలతో మాట్లాడుతాను అని చైత్ర లక్ష్మి చెప్పింది. పెద్దయ్యాక డాక్టర్ గా చేస్తూనే యాక్టర్ గా కూడా చేస్తాను అని అమ్మమ్మతో చెప్తుంది.
watch video :
ALSO READ : సీఐ తిట్టడంతో రాజీనామా చేశాడు… ఇప్పుడు ఏకంగా కలెక్టర్ అయ్యాడు..! ఇతను ఎవరో తెలుసా..?
End of Article