Ads
తెలుగు లోగిళ్ళలో సీరియళ్ళది ప్రత్యేక పాత్ర. అలాంటి సీరియళ్ళలో కార్తీక దీపం ఇంకా స్పెషల్ గా నిలిచింది. ఈ సీరియల్ కి ఎంత మంది ఫాన్స్ ఉన్నారో.. ఈ సీరియల్ పై ఎన్ని మీమ్స్ ఎంటర్టైన్ చేశాయో లెక్కలేదు. ఈ సీరియల్ మొత్తాన్ని వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలు తమ భుజాలపై మోస్తూ నడిపిస్తాయి. వీరిద్దరూ ఎప్పటికి కలుసుకుంటారో.. అని అభిమానులు కూడా ఈ సీరియల్ ను రోజు వదలకుండా చూస్తూనే ఉంటారు. వీరి మధ్య వచ్చే గొడవలు, అపార్ధాలతో ఆ సీరియల్ నడుస్తూనే ఉంటుంది.
Video Advertisement
ఈ సీరియల్ లో వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉంటారు. హిమ, సౌర్య అని వాళ్ళ పేర్లు. హిమ పెద్దింటి పిల్లే అయినా… తల్లి ప్రేమ లేక తల్లడిల్లుతూ ఉంటుంది. ఆ తరువాత, తన తల్లి వంటలక్కేనని తెలుసుకుంటుంది. ప్రస్తుతం ఈ సీరియల్ ఇంకా నడుస్తూనే ఉంది. అయితే, హిమ అసలు పేరు సహృద. ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండదు. సహృద ది సీరియల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా చాలా కష్టాలతో కూడుకున్న జీవితం. సహృద చిన్నప్పుడే తండ్రి ప్రేమ కి దూరమైంది. ఈ విషయాన్నీ ఓ స్టేజి షో లో సహృద తల్లి ప్రేక్షకులకు చెబుతూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు.
ఈ పాప సీరియల్ లో చూపించినంత కలర్ తక్కువేమి కాదు.. కేవలం ఆ పాత్ర కోసమే అలా చూపిస్తున్నారు. ఈమె తండ్రి సహృద చిన్నతనం లో ఉండగానే, ఆడ పిల్ల పుట్టిందన్న కారణం తో వదిలేసి వెళ్ళిపోయాడట. సహృద ని, ఆమె తల్లిని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడట. ప్రస్తుతం సహృద బాధ్యతలను ఆమె తల్లి తీసుకుంది. పైకి అన్ని ఉన్నట్లు కనిపించే రంగుల ప్రపంచం లోని వ్యక్తుల జీవితాల్లో కూడా చీకట్లు ఉంటాయి. వాటిని చీల్చుకుంటూ వెలుతురూ వైపు పయనించాలి. బేబీ సహృద కూడా ఇలాగే.. ఎన్నో పాత్రలు చేస్తూ మరింత ముందుకెళ్లాలి.
watch video:
End of Article