ఆస్కార్ రావడం వెనుక రాజమౌళి కొడుకు ”కార్తికేయ” కష్టం కూడా ఉందా..?

ఆస్కార్ రావడం వెనుక రాజమౌళి కొడుకు ”కార్తికేయ” కష్టం కూడా ఉందా..?

by Megha Varna

Ads

నాటు నాటు పాట కి అవార్డు రావడం తో విదేశీ గడ్డపై తెలుగోడి ఖ్యాతి రెపరెపలాడుతోంది.
నాటు నాటు సాంగ్ ఆస్కార్ కి కూడా నామినేట్ అయినప్పటి నుండి కూడా ప్రతీ ఒక్కరూ ఈ అవార్డు రావాలని కోరుకున్నారు. అనుకున్నట్టే నాటు నాటు పాట కి కూడా ఆస్కార్ వచ్చింది.

Video Advertisement

దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో అద్భుతంగా ఈ సినిమాని తెర మీద కి తీసుకురావడం జరిగింది. సినిమాకి ఆస్కార్ రావడం అంత ఈజీ విషయం కాదు.

Streaming ott list of oscar winning movies..

రాజమౌళి ఈ సినిమా కోసం ఎంతో కష్ట పడ్డారు అంత కష్టాన్ని పడ్డారు కనుక దానికి తగ్గ ఫలితం దక్కింది. విజయేంద్ర ప్రసాద్ కథని సిద్ధం చేశారు రాజమౌళి స్క్రీన్ ప్లే తో పాటుగా నటులు కూడా వాళ్ళ పాత్ర కి పూర్తి స్థాయిలో న్యాయం చేసేలా రాజమౌళి చూసారు. అందుకే ఈ సినిమా ఈరోజు ఈ స్థాయి లో వుంది. కీరవాణి మ్యూజిక్ తో పాటుగా పాటకి చంద్రబోస్ అందించిన సాహిత్యం కూడా బాగుండడంతో సినిమా ఆస్కార్ దాకా వెళ్ళింది. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఇద్దరు ఈ పాటని పాడారు. అయితే గత కొన్ని రోజుల నుండి కూడా ఈ అవార్డు కార్తికేయ లేక పోతే రాదు అని కామెంట్లు వినపడుతున్నాయి.

కార్తికేయ రమా రాజమౌళిల కొడుకు ఈ సినిమా రేంజ్ పెరగడానికి కార్తికేయ కృషి కూడా ఉంది. ఎన్టీఆర్ కూడా కార్తికేయ కార్యశూరుడు అని… వెంట పడతాడని చెప్పారు. ఈ సినిమాకి సంబంధించి అనుకున్న పనులు సరిగ్గా జరిగేలా చేశాడు. పరోక్షంగా ఈ అవార్డు రావడానికి కార్తికేయ కారణం. అందుకే కీరవాణి కార్తికేయకి కూడా కృతజ్ఞతలు చెప్పారు. కార్తికేయ పట్టు పట్టడం వలన ఈ అవార్డు వచ్చిందని అన్నారు. అలానే రాజమౌళి కృషి కూడా చాలా ఉంది రాజమౌళి కష్టానికి ఇంకా అవార్డులు రావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. రాజమౌళి, కార్తికేయ మొత్తం మీద కష్టపడి ఈ పాట కి అరుదైన గౌరవం ని దక్కించారు.

 


End of Article

You may also like