చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదల అయిన సంగతి తెలిసిందే. చిరంజీవికి ఒక మంచి హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. కథపరంగా, నటనపరంగా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా చాలా కొత్తగా ఉన్నా కూడా సినిమా ఫలితం ఆశించిన విధంగా రాలేదు.

Video Advertisement

కానీ గాడ్ ఫాదర్ ఫ్యాన్స్ ని మాత్రం నిరాశ పరచలేదని చెప్పాలి. దీని ముందు వచ్చిన ఆచార్య సినిమా మాత్రం ప్రేక్షకులని నిరాశపరిచింది. దాంతో ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. అయితే ఈ సినిమా థియేటర్లలో యావరేజ్ గా నిలిచింది.

godfather movie review

ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయ్యింది. సినిమా థియేటర్లలో విడుదల అయినప్పుడు చాలా మంది చూడచ్చు, చూడకపోవచ్చు. అలా థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఇలా డిజిటల్ రిలీజ్ అయినప్పుడు చూస్తారు. అలా చూసిన వారు ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి సోషల్ మీడియాలో రివ్యూలు ఇవ్వడం వంటివి చేస్తూ ఉంటారు. అలా థియేటర్లలో హిట్ అవ్వకుండా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాకి కూడా అలాగే ఒక వ్యక్తి ఇచ్చిన రివ్యూ చర్చల్లో నిలిచింది.

kartik dayanand tweet on chiranjeevi godfather movie

ఇటీవల కార్తీక్ దయానంద్ అనే ఒక వ్యక్తి గాడ్ ఫాదర్ సినిమాకి రివ్యూ ఇచ్చారు. అందులో కార్తీక్ దయానంద్ ఈ విధంగా రాశారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ, “ఇప్పుడే గాడ్ ఫాదర్ ని నెట్‌ఫ్లిక్స్‌లో చూశాను. ఈ సినిమాలో చిరంజీవి అతిథి పాత్రలో నటిస్తున్నారని నాకు తెలియదు. ఇది సత్య దేవ్ ఔట్ అండ్ అవుట్ షో. సినిమా నిజానికి ఒక అట్ట పెట్టెలాంటిది. బయటికి ఏదో కనిపించినా కూడా దాని లోపల ఏమీ లేదు” అని రాశారు. దాంతో నెటిజన్లు అందరూ, “అంత మంచి సినిమాని ఇలా అంటున్నారు ఏంటి?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.