వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న హీరోల్లో ఒకరు కార్తికేయ గుమ్మకొండ. కేవలం హీరోగా మాత్రమే కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా కార్తికేయ నటించి తనని తాను నటుడిగా నిరూపించుకున్నారు. కార్తికేయ హీరోగా నటించిన బెదురులంక 2012 సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : బెదురులంక 2012
  • నటీనటులు : కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్.
  • నిర్మాత : రవీంద్ర బెనర్జీ ముప్పనేని
  • దర్శకత్వం : క్లాక్స్
  • సంగీతం : మణి శర్మ
  • విడుదల తేదీ : ఆగస్ట్ 25, 2023

bedurulanka 2012 movie review

స్టోరీ :

2012లో జరిగే కథ ఇది. బెదురులంక అనే ఒక గ్రామానికి చెందిన శివ (కార్తికేయ) హైదరాబాద్ లో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ మానేసి తన ఊరికి వచ్చేస్తాడు. ఊరిలో యుగాంతం రాబోతోంది అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ వార్తలను చూసిన భూషణం (అజయ్ ఘోష్) ఆ ఊరి ప్రజలని మోసం చేద్దాము అనుకుంటాడు. అక్కడ జాతకాలు చూస్తాను అని చెప్పి ప్రజల్ని మోసం చేసే బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్), చర్చి ఫాదర్ కొడుకు అయిన డేనియల్ (ఆటో రాంప్రసాద్) తో కలిసి యుగాంతం రాబోతోంది అని ఊరి ప్రజలు నమ్మేలాగా చేస్తాడు.

bedurulanka 2012 movie review

ఆ ఊరి ప్రెసిడెంట్ (గోపరాజు రమణ) కూడా నిజంగానే యుగాంతం రాబోతోంది అని నమ్ముతాడు. ఇంతలో ఆ ఊరిలోని ప్రెసిడెంట్ గారి అమ్మాయి అయిన చిత్ర (నేహా శెట్టి) తో శివ ప్రేమలో పడతాడు. ఇక్కడ జరిగే ఏ విషయాన్ని కూడా శివ నమ్మడు. శివ వాళ్ల మోసాలని ఎలా బయటపెట్టాడు? ఊరి ప్రజలకు ఇదంతా ఎలా చెప్పాడు? ఆ తర్వాత శివ ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? వాటన్నిటిని ఎలా పరిష్కరించాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

2012 లో యుగాంతం వస్తుంది అని పెద్ద ఎత్తున ప్రచారం అయిన వార్త గురించి తెలిసిందే. ప్రపంచమంతా మునిగిపోతుంది అని అన్నారు. ఇదే విషయం మీద ఇప్పుడు సినిమా వచ్చింది. ఇలాంటి నమ్మకాల వల్ల జనాలు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటారు అనే విషయాన్ని కాస్త కామెడీ యాడ్ చేసి డైరెక్టర్ ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. అంతే కాకుండా ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ప్రయోగం.

bedurulanka 2012 movie review

సినిమా మొదటి నుండి కూడా డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అదే పాయింట్ స్ట్రైట్ గా చూపించారు. కానీ కథ బలం మాత్రం ప్రీ ఇంటర్వెల్ లోనే పెరుగుతుంది. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శివ పాత్రలో కార్తికేయ బాగా నటించారు. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిగా, తన ఊరి ప్రజలని ఆ నమ్మకాల నుండి బయటకు తీసుకురావాలి అని శివ మాట్లాడే డైలాగ్స్ బాగున్నాయి.

bedurulanka 2012 movie review

హీరోయిన్ నేహా శెట్టి పాత్ర పెద్ద గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. తన పాత్రకి తగ్గట్టు నటించారు. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. వారందరికీ మంచి పాత్రలు దొరికాయి. వారందరి మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి. దర్శకుడు కామెడీ కోసం ప్రత్యేకంగా ఒక ట్రాక్ రాయకుండా, వారు ఎదుర్కొంటున్న పరిస్థితుల నుండే కామెడీ జనరేట్ చేయడానికి ప్రయత్నించారు. దాంతో సినిమాలో చూస్తున్నంతసేపు కామెడీ సీన్స్ చాలా సహజంగా అనిపిస్తాయి. ఒక రకంగా సినిమాకి ఇది పెద్ద ప్లస్ అయ్యింది.

bedurulanka 2012 movie review

అందులోనూ నటీనటులు అందరూ కూడా మంచి కామెడీ టైమింగ్ ఉన్న వారు అవ్వడంతో సీన్స్ ఇంకా బాగా కనిపించాయి. అయితే సినిమా ఒక ఫ్లోలో నడుస్తున్నప్పుడు హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ మాత్రం మధ్యలో ఏదో అడ్డు లాగా అనిపిస్తుంది. మణిశర్మ పాటలు కూడా అంత చెప్పుకోదగ్గట్టుగా ఏమీ లేవు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి మరొక బలం అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది. కానీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ మాత్రం అనవసరమేమో అనిపిస్తాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్ :

  • కామెడీ
  • దర్శకుడు ఎంచుకున్న పాయింట్
  • నటీనటుల పెర్ఫార్మెన్స్
  • క్లైమాక్స్ ఎపిసోడ్

మైనస్ పాయింట్స్:

  • హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్
  • ఫస్ట్ హాఫ్ లో సాగదీసినట్టుగా ఉన్న కొన్ని సీన్స్

రేటింగ్ :

2.5 / 5

ట్యాగ్ లైన్ :

సినిమా కోసం ఎంచుకున్న పాయింట్ బాగున్నా కూడా లోపాలు అయితే ఉన్నాయి. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమా చూద్దాం అని అనుకునే వారికి బెదురులంక 2012 సినిమా ఒక్కసారి చూడగలిగే కామెడీ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది.

watch trailer :