సాధారణంగా భక్తి చిత్రాలు ప్రేక్షకులకు త్వరగా కనెక్ట్ అవుతాయి. అందులోనూ రామాయణం అయితే అందరికి తెలిసిన స్టోరీ కావడం వల్ల రామాయణం బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలపై మరింత ఆసక్తి ఏర్పడుతుంది.అలా రూపొందిన చిత్రం ఆదిపురుష్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీ రాముడి పాత్రలో నటిస్తుండడంతో సినిమా ప్రకటించినప్పటి నుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Video Advertisement
కానీ ఈ మూవీ పోస్టర్ రిలీజ్ అయినపుడు మొదలైన వివాదాలు ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నాయి. వివాదాలుమధ్యే ఈ మూవీ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రం పై ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తున్న సీనియర్ హీరోయిన్ కస్తూరి షాకింగ్ కామెంట్స్ చేసింది. అవి వైరల్ గా మారాయి. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం ఆదిపురుష్. 600 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక ఈ మూవీ పోస్టర్, ఆ తరువాత రిలీజ్ చేసిన టీజర్ తో ఈ చిత్రాన్ని వివాదాలు చుట్టు ముట్టాయి. కార్టూన్ యానిమేషన్ ల ఉందని, రామాయణంలా లేదని, ముఖ్యంగా రావణుడు పాత్ర పై ఎన్నో విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ విపరీతంగా జరిగింది.
ఆ తరువాత గ్రాఫిక్స్ పై మరింత ఫోకస్ చేసి, మార్పులు చేసి ట్రైలర్ రిలీజ్ చేశారు. టీజర్ కన్నా బెటర్ గా ఉండడంతో ట్రైలర్ తో మూవీ పై అంచనాలు పెరిగాయి. అయితే సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశాక మరిన్ని వివాదాలు మొదలయ్యాయి. ఇక తాజాగా ఈ చిత్రం పై, ప్రభాస్ లుక్స్ పై ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుత సీరియల్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సీనియర్ హీరోయిన్ కస్తూరి ప్రస్తుతం ఇంటింటి గృహలక్ష్మి అనే సీరియల్‌లో నటిస్తున్నారు. ఆమె ప్రభాస్ ఈ మూవీలో రాముడిలా కాకుండా కర్ణుడులా కనిపిస్తున్నారని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తుండగా, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆమె పై మండిపడుతున్నారు.