“మహేష్ బాబుకి నేను తల్లిగా చేయడం ఏంటి..?” అంటూ… హీరోయిన్ “కస్తూరి” కామెంట్స్..! రజనీకాంత్ సినిమాలో కూడా..?

“మహేష్ బాబుకి నేను తల్లిగా చేయడం ఏంటి..?” అంటూ… హీరోయిన్ “కస్తూరి” కామెంట్స్..! రజనీకాంత్ సినిమాలో కూడా..?

by Mohana Priya

Ads

ఇంటింటి గృహలక్ష్మి అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు నటి కస్తూరి శంకర్. తను అనుకున్నది అనుకున్నట్టు, భయపడకుండా మాట్లాడతారు కస్తూరి. ఏ విషయం మీద అయినా సరే, తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. సోషల్ మీడియాలో చాలా విషయాల మీద కస్తూరి మాట్లాడుతూ ఉంటారు. గతంలో కూడా ఎన్నో సినిమాల గురించి, సినిమాలకు సంబంధం లేని విషయాల గురించి, కూడా తనకి ఏదైనా అభిప్రాయం ఉంటే, ఆ అభిప్రాయాన్ని కస్తూరి వ్యక్తం చేశారు. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా పట్టించుకోకుండా ధైర్యంగా తన అభిప్రాయాన్ని చెప్తారు.

Video Advertisement

కస్తూరి గతంలో సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. చాలా సినిమాల్లో హీరోయిన్ గా, ముఖ్య పాత్రల్లో నటించారు. అవి కూడా కస్తూరికి చాలా మంచి పేరు తీసుకొచ్చాయి. కస్తూరి మొదటి నుండి కూడా పాత్రకి ప్రాధాన్యం ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన సినిమాల ఎంపిక ఎలా ఉంటుంది అనేది చెప్పారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ సినిమాలో, నటి సీత పోషించిన పాత్ర పోషించే అవకాశం మొదట తనకే వచ్చింది అని తెలిపారు. అగ్రిమెంట్ కూడా చేశారు అని, తర్వాత యంగ్ గా కనిపిస్తున్నారు అనే ఉద్దేశంతో ఆ పాత్ర నుండి తనని తొలగించినట్టు చెప్పారు.

రజనీకాంత్ హీరోగా నటించిన కాలా సినిమాలో కూడా ఈశ్వరి రావు పోషించిన పాత్ర కోసం మొదట కస్తూరిని అనుకున్నారట. కానీ రజనీకాంత్ పక్కన, అంత పెద్ద పిల్లలకు తల్లిగా కస్తూరి సరిపోరు అని ఉద్దేశంతో ఆ పాత్రకి కస్తూరిని తీసుకోలేదు. “అందరూ వయసు ఎక్కువ అయిపోతుంది అని బాధపడతారు. కానీ నేను వయసు అవ్వట్లేదు అని బాధ పడతాను. ఎందుకంటే నా ఫేస్ అలాంటిది. నేను యంగ్ గా కనిపిస్తాను. నేను నా జుట్టుకి రంగు కూడా వేయను.”

“కానీ సినిమాల కోసం తెల్ల రంగు వేసుకుని నటించాల్సి వస్తుంది. వయసు వస్తే ఒక బాధ. రాకపోతే ఇంకొక బాధ. ఇంకొక 30 సంవత్సరాలు అయినా కూడా నాకు తల్లి పాత్రలు వస్తాయి. కానీ ఎలా చేస్తాను. మహేష్ బాబు ఏజ్, నా ఏజ్ ఒకటే. ఆయనకి నేను మదర్ లాగా ఎలా సూట్ అవుతాను. ఆయన పక్కన హీరోయిన్ లాగా కనిపిస్తాను కానీ” అని అన్నారు. కస్తూరి మే 1వ తేదీ, 1974 లో పుట్టారు. మహేష్ బాబు 1975 లో పుట్టారు. కస్తూరి మహేష్ బాబు కంటే ఒక్క సంవత్సరం పెద్దవారు అని తెలుస్తోంది.

ALSO READ : హోమ్ గ్రౌండ్‌లో ఈ సీజన్‌లో మొదటిసారి చెన్నై ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇదేనా.?


End of Article

You may also like