తెలుగులో మొదటగా అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

తెలుగులో మొదటగా అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

by Megha Varna

Ads

సినీ పరిశ్రమలో ఒక్క చిత్రం హిట్ అయితే చాలు హీరోయిన్స్ భారీ మొత్తాన్ని పారితోషకంగా డిమాండ్ చేస్తున్నారు.ఇప్పట్లో ఒక్క విజయవంతమైన చిత్రంలో నటిస్తే చాలు కోటి రూపాయలకు పైగా డిమాండ్ చేస్తున్నారు నేటి తారలు.అయితే మొదటగా తెలుగులో భారీ పారితోషకం అందుకుంది మాత్రం బాలీవుడ్ నటి కత్రినా కైఫ్.సురేష్ ప్రొడక్షన్స్ లో సురేష్ బాబు నిర్మించిన మల్లీశ్వరి చిత్రంలో హీరో వెంకటేష్ సరసన నటించారు కత్రినా కైఫ్.అయితే మల్లీశ్వరి చిత్రానికి గాను కత్రినా కైఫ్ అందుకున్న పారితోషకం ఎంతో తెలుసా?

Video Advertisement


మల్లీశ్వరికి చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించగా నేటికీ ఈ చిత్రంలోని పంచ్ డైలాగులు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.కాగా మీర్జాపురం యువరాణిగా కత్రినా కైఫ్ ,పెళ్లి కానీ ప్రసాద్ పాత్రలో వెంకటేష్ నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.అయితే మల్లీశ్వరి చిత్రానికి గాను 75 లక్షల రూపాయల పారితోషకాన్ని అందుకున్నారు కత్రినా కైఫ్..ఇప్పట్లో హీరోయిన్ లకు ఇది చిన్న మొత్తమే అయినప్పటికీ అప్పట్లో మాత్రం ఒక హీరోయిన్ కి అది చాలా పెద్ద అమౌంట్.అప్పట్లో కత్రినా కైఫ్ కు ఇచ్చిన పారితోషకం మీద చిత్ర వర్గాలలో పెద్ద చర్చలే జరిగాయి.అయితే తర్వాత బాలకృష్ణ సరసన “అల్లరి పిడుగు” చిత్రంలో నటించారు కత్రినా కైఫ్.కానీ ఆ చిత్రం విఫలం అవ్వడంతో తెలుగుతెరకు దూరమయ్యారు కత్రినా కైఫ్ .


End of Article

You may also like