కొవిడ్ వచ్చినా నో ట్రీట్మెంట్.. చాలా ఇబ్బందికర పరిస్థితిలో కౌశల్ భార్య.. అసలేమైంది..?

కొవిడ్ వచ్చినా నో ట్రీట్మెంట్.. చాలా ఇబ్బందికర పరిస్థితిలో కౌశల్ భార్య.. అసలేమైంది..?

by Anudeep

Ads

బిగ్ బాస్ సీజన్ 2 లో విజేత గా నిలిచిన కౌశల్ ఇటీవల చేసిన పోస్ట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తన భార్య గురించి కౌశల్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ను చూసి అభిమానులు కంగారు పడ్డారు.. వదినకి ఏమైంది అన్నా..? అంటూ అడిగారు. కౌశల్ పెట్టిన పోస్ట్ ఏంటంటే..” ఏదైనా సాధిద్దాం అని బయలుదేరావు.. నీ జీవితం తో పోరాడుతున్నావ్.. నువ్వు అనుకున్నది సాధిస్తావ్ అని తెలుసు.. తప్పకుండా తిరిగి రా… లవ్ యు అండ్ మిస్ యు..!” అని కౌశల్ పోస్ట్ చేసాడు.

Video Advertisement

neelima 3

దీనితో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అసలు కౌశల్ భార్యకు ఏమైంది అంటూ కామెంట్స్ లో ప్రశ్నించారు. ఈ నేపధ్యం లో కౌశల్ భార్య నీలిమ ఓ వీడియో ను రిలీజ్ చేసారు. భర్త, పిల్లలకు దూరం గా ఆమె యుకె లో ఉంటూ జాబ్ చేస్తున్నారు. అయితే, యుకె లో ఉన్న నీలిమ కు కొవిడ్ సోకింది. ఆమెకు సరైన ట్రీట్మెంట్ కూడా అందలేదు. ఈ క్రమం లోనే ఆమె ఆందోళన చెందారు. ఆమె వీడియో లో మాట్లాడుతూ..” హాయ్.. అందరు ఎలా ఉన్నారు.. నాకు కొవిడ్ సోకింది. ఇక్కడ యుకె లో అంతా బాగానే ఉంది కదా అనుకున్నా.. నాకు కొవిడ్ సోకుతుందని అనుకోలేదు. మా ఆఫీస్ లో ఒకరికి సోకడం వలన నాకు కూడా వచ్చింది..

neelima 2

ఇప్పటికి కొవిడ్ సోకి ఏడవరోజు. ఇండియా లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనుకున్న.. కానీ ఇక్కడ అంతకంటే దారుణం గా ఉంది. కనీసం ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదు. కొవిడ్ వచ్చాక నాకు బ్రీతింగ్ ప్రాబ్లెమ్ ఎక్కువైంది. చెస్ట్ పెయిన్ వచ్చేది. ఎంత ఇబ్బందిగా ఉన్నా డాక్టర్లను సంప్రదిస్తే ఆరు గంటలకు ఒకసారి పారాసెటమాల్ 1000 ఎంజి ఒక్కటే వాడమని చెప్పారు. అంతేకాని ఎమర్జెన్సీ అని చెప్పినా ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వలేదు. ఇంత బాడ్ ఎక్స్పీరియెన్స్ ఫేస్ చేస్తాను అని అనుకోలేదు. దేవుడి దయతో ప్రస్తుతం నాకు సెట్ అయింది. ఇప్పటికి వైరస్ సోకి ఇది ఏడవరోజు..

neelima 1

ఇక్కడి కంటే ఇండియాలోనే బెటర్.. కనీసం అక్కడ వైద్యులు ట్రీట్మెంట్ అయినా ఇస్తున్నారు. మంచి డాక్టర్లు ఉన్నారు. ఇక్కడ కూడా డాక్టర్లు ఉన్నారు.. కానీ సిస్టం ఫాలో అవ్వమని చెబుతున్నారు. ట్రీట్మెంట్ లేదా మెడిసిన్ ను ఇవ్వడం లేదు.. కొవిడ్ తగ్గాకా.. నాకు ఇండియా కి రావాలని, పిల్లలని చూడాలని ఉంది. యుకె లో ఉండగా కొవిడ్ వస్తే పరిస్థితి ఏంటో మీతో పంచుకోవాలని ఉంది.. అందరు ధైర్యం గా ఉండండి.. ” అంటూ నీలిమ వీడియో లో చెప్పుకొచ్చారు.

Watch Video:


End of Article

You may also like