భారీ అంచనాల నడుమ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా సర్కార్ వారి పాట. ఈ సినిమాలో మహేష్ బాబు హీరో,కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించింది. అయితే కీర్తి సురేష్ చేసిన పొరపాటు వల్ల మహేష్ బాబుకు సారీ చెప్పానని అన్నది.ఈ తప్పిదానికి మహేష్ సీరియస్ అవ్వలేదని ఆ సమయంలో చాలా కూల్ గా వ్యవహరించాడని తెలియజేసింది. సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ కు ఒక మంచి పాత్ర ఉందని తెలుస్తోంది. ఈ సినిమా గురించి మహేష్ బాబు చెప్పినప్పుడు ఆయన అందులో హీరోగా నటించడమే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా చేస్తానని చెప్పడం విశేషం. ఈ సినిమాలోని కథ మరియు కథనం గురించి మహేష్ బాబు చెప్పినప్పుడు చాలా బాగుందని చేద్దామని చెప్పడం తో డైరెక్టర్ పరశురాం చాలా ఆనందించారట. అయితే ఈ కథనం రాసింది స్పెషల్ గా మహేష్ బాబు కోసమేనని ఆయన అంటున్నారు. మహేష్ బాబుతో ఒక సాంగ్ చేస్తున్న సమయంలో కీర్తి సురేష్ ఒక స్టెప్ లో కొంచెం కోఆర్డినేషన్ మిస్ అయిందట.

Video Advertisement

ఆ క్రమంలో మహేష్ బాబు ఫేస్ మీద లైట్ గా టచ్ చేసిందట. దీంతో కీర్తి సురేష్ చాలా భయపడి పోయిందట. ఆ స్టెప్ 2, 3 టైమ్స్ చేశాక సారీ అని చెప్పానని అంటోంది కీర్తి. ఈ క్రమంలో మహేష్ బాబు సింపుల్ గా ఇట్స్ ఓకే అని అనేశారని కీర్తి తెలిపింది.