Ads
ఎన్నో రోజులు వెయిట్ చేసిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్-2 విడుదల అయ్యింది. కేజీఎఫ్ మొదటి భాగం ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయ్యింది. మొదటి భాగం మొత్తంలో కూడా రాకీ భాయ్ ఎలా ఎదిగాడు అనేది చూపించారు. రెండవ భాగంలో మాత్రం రాకీ భాయ్ ఎదిగిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది చూపించారు? మొదటి భాగంలాగానే ఈ సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది.
Video Advertisement
ఈ సినిమాతో హీరో, విలన్ల తో పాటు ఇతర ముఖ్య నటీనటులకు కూడా పేరు ప్రఖ్యాతలు లభించాయి. అయితే.. ఈ సినిమాతో పాపులర్ అయిన కన్నడ నటుడు అయ్యప్పకు మెగాస్టార్ ఆచార్య సినిమాలో ఓ కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చిందట.
కానీ, ఆ సమయంలో ఆయన నెట్ వర్క్ సరిగ్గా లేని ఓ ప్రాంతానికి షూటింగ్ నిమిత్తం వెళ్లారట. ఆచార్య యూనిట్ ఆయనకు ఫోన్స్, మెసేజెస్, ఈమెయిల్స్ ఇలా ఎన్ని చేసినా ఆయన స్పందించకపోయేసరికి ఆ పాత్ర కోసం మరొకరిని ఎంచుకుని షూటింగ్ పూర్తి చేశారట. అయితే.. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న నటుడు అయ్యప్ప ఆచార్య సినిమాలో ఛాన్స్ మిస్ అయినందుకు ఫీల్ అవుతున్నారట.
End of Article