Ads
కెజిఎఫ్.. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయింది. అనూహ్యం గా సూపర్ హిట్ అయింది. ఈ కన్నడ సినిమా ని తెలుగు లో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా తెలుగు లోనే కాదు.. సౌత్ ఇండియా లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి నాన్ బాహుబలి రికార్డు లను సొంతం చేసుకుంది. ఈ సినిమా తో హీరో యశ్ రేంజ్ కూడా అమాంతం గా పెరిగిపోయింది. కెజిఎఫ్ హిట్ కావడం తో, ఈ సినిమా కంటిన్యుషన్ గా కెజిఎఫ్ 2 ని కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే, ఇటీవలే కెజిఎఫ్ 2 నుంచి టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే, కెజిఎఫ్ సినిమా ను తెలుగు లోకి డబ్ చేయడం వెనుక ఎవరెవరు డబ్బింగ్ ఆర్టిస్ట్ లు కష్టపడ్డారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Video Advertisement
మాములుగా, ఏ సినిమాని అయినా మరో భాష లోకి డబ్ చేయాలి అంటే అన్ని పాత్రలకు వాయిస్ ఓవర్ చెప్పాల్సి ఉంటుంది కాబట్టి.. ఎక్కువ మందే డబ్బింగ్ ఆర్టిస్ట్ లు అవసరం అవుతారు. కెజిఎఫ్ సినిమా కి ఇంకా ఎక్కువ మంది డబ్బింగ్ ఆర్టిస్ట్ లు పని చేసారు.
#1. ప్రైమ్ మినిస్టర్ వాయిస్
ముందు గా ఈ సినిమా ప్రైమ్ మినిస్టర్ వాయిస్ తో స్టార్ట్ అవుతుంది. ప్రైమ్ మినిష్టర్ ఆక్షన్ అని చెప్తూ ఈ సినిమా మొదలవుతుంది. ఈ ప్రైమ్ మినిష్టర్ పాత్రకి క్రాంతి అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పింది. ఈ క్రాంతి అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ మరో పాత్రకి కూడా డబ్బింగ్ చెప్పింది. ఆ పాత్రే ఎడిటర్.
#2. న్యూస్ ఎడిటర్
కెజిఎఫ్ సినిమాలో దీప అనే న్యూస్ ఎడిటర్ ఉంది. ఆమె పాత్రకు కూడా క్రాంతి నే డబ్బింగ్ చెప్పింది. క్రాంతి కేవలం డబ్బింగ్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు. ఆమె ఈటీవీ లో యాంకర్ గా పని చేశారు. ఇంకా పలు సినిమాల్లో కనిపించారు.
3. న్యూస్ ఛానల్ ఓనర్
తరువాత న్యూస్ ఛానల్ ఓనర్ పాత్రకి కిషోర్ గారు డబ్బింగ్ చెప్పారు. ఈయన అరుంధతి సినిమా లో జేజమ్మ ఫాదర్ క్యారక్టర్ ను చేసారు.
4. ఆనంద్
అలాగే, ఆనంద్ అనే పాత్రకి శుభలేఖ సుధాకర్ గారు డబ్బింగ్ చెప్పారు.
5. టీ బాయ్ క్యారక్టర్
ఇంకా టీ బాయ్ క్యారక్టర్ ఒకటి ఉంది. ఎడిటర్ ని చూసి భయపడే ఈ క్యారక్టర్ కి లక్ష్మణ్ డబ్బింగ్ చెప్పారు.
6. రాకీ మదర్
తరువాత రాకీ మదర్.. ఆమె అమల అనే సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పారు. ఆమె ఇప్పటికే చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు.
7. యంగ్ రాకి
తరువాత యంగ్ రాకి కి చరణ్ అనే ఓ చైల్డ్ ఆర్టిస్ట్ తో డబ్బింగ్ చెప్పించారు. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పటికే చాలా సీరియల్స్ తో ఆక్ట్ చేసాడు.
8. శశి
తరువాత లావు గా ఉండే శశి అనే క్యారక్టర్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ కి ఉదయ్ రాజ్ అనే ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పారు.
9. గరుడ
తరువాత మెయిన్ విలన్ గరుడ అనే క్యారక్టర్ కి శంకర్ కుమార్. ఈయన సిఐడి లో కూడా డబ్బింగ్ చెప్పారు. ఇంకా, సైరా సినిమా లో కూడా అమితాబ్ బచ్చన్ కి కూడా డబ్బింగ్ చెప్పారు.
10. ముస్లిం క్యారక్టర్
అలాగే ఒక ముస్లిం క్యారక్టర్ ఉంటుంది. రాకీ గురించి ఎలేవేషన్ ఇచ్చే కారెక్టర్. ఈ క్యారక్టర్ కి డబ్బింగ్ చెప్పింది గోపి అనే డబ్బింగ్ ఆర్టిస్ట్.
11. హీరో రాకీ
హీరో రాకీ కి డబ్బింగ్ చెప్పింది వాసు అనే డబ్బింగ్ ఆర్టిస్ట్. ఇతర భాషల్లోంచి ఏ సినిమా తెలుగు లోకి డబ్ అయినా హీరోలకు డబ్బింగ్ చెప్పేది వాసు నే.
12. ముంబై మొత్తం రాసిస్తా అంటూ ఆఫర్ ఇచ్చే ఓ క్యారక్టర్
ఆ తరువాత ఓ క్యారక్టర్ బెంగళూరు లో పని చేస్తే, ముంబై మొత్తం రాసిస్తా అంటూ ఆఫర్ ఇచ్చే ఓ క్యారక్టర్ ఉంటుంది. ఈ క్యారక్టర్ కి డబ్బింగ్ చెప్పింది మోహన్ కుమార్అ నే డబ్బింగ్ ఆర్టిస్ట్.
13. హీరోయిన్
హీరోయిన్ క్యారక్టర్ కి డబ్బింగ్ చెప్పింది జ్యోతి వర్మ. ఈమె రంగస్థలం లో సమంత కు కూడా డబ్బింగ్ చెప్పారు.
14. కమల్
కమల్ క్యారక్టర్ కి డబ్బింగ్ చెప్పింది ఆర్సిఎం రాజు గారు. ఈయన చాలా మంది విలన్లకు డబ్బింగ్ చెప్పారు.
15. దయ అన్న
ఈ సినిమా లో దయ అన్న క్యారక్టర్ కి కేవి ఆర్ మూర్తి అన్న ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పారు.
16. Rocky monster అని చెప్పే క్యారెక్టర్
ఇంకా ఈ క్యారక్టర్ కి జీవా వాయిస్ ఓవర్ ఇచ్చారు. జీవా చాలా తెలుగు సినిమాల్లో విలన్ క్యారక్టర్ లో నటించిన సంగతి తెలిసిందే.
17. లక్కీ లక్ష్మణ్
ఇక లక్కీ లక్ష్మణ్ అనే క్యారక్టర్ కి ఈశ్వర్ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పారు.
18. పిచ్చోడి క్యారక్టర్
ఇంకా, కెజిఎఫ్ లో ఓ పిచ్చోడి క్యారక్టర్ ఉంటుంది. ఈ పిచ్చోడి క్యారక్టర్ కి మోహన్ రావ్ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈయన వాయిస్ దాదాపు ప్రతి సినిమాలో కనిపిస్తుంది. ఏ వాయిస్ కి అయినా మ్యాచ్ అయ్యేలా చెప్పడం ఈయన ప్రత్యేకత.
19. వానరం
ఈ మెయిన్ విలన్ క్యారక్టర్ కు అయ్యప్ప పి శర్మ డబ్బింగ్ చెప్పారు. ఈ పాత్రని పోషించింది కూడా అయ్యప్ప పి శర్మ నే. అయ్యప్ప పి శర్మ తెలుగువారికి పరిచితుడే. ఈయన సాయి కుమార్ గారి బ్రదర్.
End of Article