కే జి ఎఫ్ 2 కు – బిగ్ బాస్ షో కు ఉన్న లింక్ ఏంటి? అసలు ఇనాయత్ ఖలీల్ ఎవరో తెలుసా..?

కే జి ఎఫ్ 2 కు – బిగ్ బాస్ షో కు ఉన్న లింక్ ఏంటి? అసలు ఇనాయత్ ఖలీల్ ఎవరో తెలుసా..?

by Sunku Sravan

Ads

భారీ అంచనాల నడుమ రిలీజైన కేజిఎఫ్ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ మూవీలో ఒక పాత్ర గురించి చాలా పవర్ ఫుల్ గా చూపించాడు. ఆ పాత్రే ఇనాయత్ ఖలీల్..ఈ పాత్రలో నటించిన వ్యక్తి పేరు బాలకృష్ణ. కాగా ఈ నటుడు టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్న ఆదర్శ బాలకృష్ణ తండ్రి కావడం కొసమెరుపు.

Video Advertisement

ఆదర్శ్ బాలకృష్ణ బిగ్ బాస్ సీజన్ 1 లో తెలుగు కంటెస్టెంట్ గా రావడమేకాకుండా పలు తెలుగు సినిమాల్లో కూడా నటించి పాపులారిటీ పెంచుకున్న వ్యక్తి. ఖలీల్ దుబాయ్ డాన్ పాత్రలో ఈ మూవీలో కనిపించి ఆ పాత్రకు న్యాయం చేశారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ కు బాలకృష్ణ బంధువు అని ఈ విధంగానే బాలకృష్ణకు ఛాన్స్ దక్కిందని సమాచారం.

ఇనాయత్ ఖలీల్ రోల్ కె.జి.ఎఫ్ చాప్టర్ 3 లో కూడా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సందర్భంగానే ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ 3 కూడా ఉండబోతుందని మరిన్ని అంచనాలను పెంచేశారు. కేజిఎఫ్ 3 నిజంగానే ఉంటుందా? ఉండదా? అనే క్లారిటీ రావాలంటే మనం కొద్ది రోజులు ఆగాల్సిందే. ఏది ఏమైనా ప్రశాంత్ నీల్ ఇంకా మంచి విజయాన్ని అందుకోవాలని అభిమానులు కోరుతున్నారు.


End of Article

You may also like