కొన్ని సినిమాలు విడుదల అయినప్పుడు హిట్ అవ్వవు. తర్వాత టీవీలో చూసినప్పుడు అందరికీ చాలా నచ్చుతాయి. “అరే! అసలు ఈ సినిమా ఎలా ఫ్లాప్ అయింది. అసలు ఎవరికి టేస్ట్ లేదు” అని అనుకుంటాం. ఇదే మాటని సోషల్ మీడియాలో ఆ సినిమాకి సంబంధించిన పోస్ట్ కింద కామెంట్స్ లో, అలాగే యూట్యూబ్ లో ఆ సినిమాకి సంబంధించిన వీడియోస్ కింద కామెంట్స్ లో పెడుతూ ఉంటాం. అలాంటి సినిమాల్లో ఒకటే మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా మూవీ.

Video Advertisement

 

ఈ సినిమా వచ్చి పదేళ్లు దాటింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయినా.. మహేష్’లో ఓ కొత్త కోణాన్ని చూపింది. ఈ సినిమాలో మహేష్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ చాలా కొత్తగా ఉంటాయి. మహేష్‌కు జోడిగా అనుష్క నటించింది. మహేష్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన రెండో సినిమాగా వచ్చిన ‘ఖలేజా’పై భారీ అంచనాలే ఉన్నాయి. కానీ ఈ చిత్రం వెండి తెరపై అలరించక పోయినా.. టీవీలో మాత్రం హైయ్యేస్ట్ టీఆర్ పీ రేటింగ్స్’తో అదరగొట్టింది.

do you know this plant from khaleja movie..!!

ఖలేజాలో సినిమాలో కథ, కథనంతో పాటు అనేక విషయాల్లో వైవిధ్యం పుష్కలంగా ఉన్నప్పటికీ జనాలకు అప్పట్లో నచ్చలేదు. అయితే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ లో ఒకటి అనుష్క కి, మహేష్ బాబు కి మధ్య వచ్చే సీన్స్. అమాయకంగా ఉండే అనుష్క తో మహేష్ చేసే కామెడీ అందరినీ అలరించింది. ఈ చిత్రం లో మహేష్ క్యాబ్ డ్రైవర్ గా నటించగా.. అనుష్క ఒక వృక్ష ప్రేమికురాలిగా నటించింది.

do you know this plant from khaleja movie..!!

అయితే ఒక సీన్ లో అనుష్క వల్ల మహేష్ హాస్పిటల్ పాలవుతాడు. అప్పుడు మహేష్ ని పరామర్శించాడనికి అనుష్క వస్తుంది. మహేష్ త్వరగా కోలుకోవాలని కోరుతూ ఫైసా మొక్క ఇద్దామని వచ్చాను అని చెప్తుంది. మహేష్ కి అదేంటో అర్థం కాకపోతే ..” ఫైకాస్ రిలీజియోజ ఇవ్వడానికి వచ్చాను. ఇదంటే నాకెంతో ఇష్టం”. అని చెప్తుంది అనుష్క.

అయితే ఇంతకీ అనుష్క కి అంత ఇష్టమైన మొక్క ఏంటో తెలుసా.. రావి చెట్టు. ఫైకాస్ రిలీజియోజ అన్నది దాని శాస్త్రీయ నామం. అంత పెద్ద రావి చెట్టుని ఇంట్లో ఎవరు పెంచుకుంటారు అనుకుంటున్నారా.. అది బోన్సాయ్ మొక్క. ఆ మొక్కలు చిన్నగానే పెరుగుతూ ఇంట్లో పెంచుకోవడానికి అనువుగా ఉంటాయి. అసలు దాని పేరు వింటే అదొక రావి చెట్టు అని నమ్మ బుడ్డి కావడం లేదు కదా..!!