Ads
కొన్ని వరుస ఫ్లాపుల తర్వాత క్రాక్ తో బ్లాక్ బస్టర్ కం బ్యాక్ ఇచ్చారు రవితేజ. దాంతో ఖిలాడి కూడా మరొక హిట్ అవుతుంది అని ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాకుండా సినిమా బృందం కూడా సినిమా చాలా కొత్తగా ఉంటుంది అని, ఇందులో యాక్షన్ సీన్స్ చాలా బాగా వచ్చాయి అని చెప్పారు.
Video Advertisement
నిజంగానే సినిమా టెక్నికల్‌గా చాలా రిచ్‌గా అనిపిస్తుంది. అలాగే ఫైట్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంటర్నేషనల్ రేంజ్‌లో డిజైన్ చేశారు.
కానీ కథ పరంగా మాత్రం ఖిలాడిలో ఎక్కడో ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది. సినిమా కథ రాసుకున్నప్పుడు బాగున్నా తీసేటప్పుడు ఏదో లోపించినట్లు అనిపిస్తుంది. అయితే.. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం సినిమాకి హైలెట్ గా నిలిచింది అని చెప్పొచ్చు. అయితే.. ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో టాక్ నడుస్తోంది.
ఈ సినిమా ఓ తమిళ్ సినిమా కి కొన్ని మార్పు చేర్పులు చేసి తీశారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తమిళనాట అరవింద స్వామి నటించిన ‘శత్రుంగ వేట్టై 2 ‘ సినిమాకే కొన్ని మార్పులు చేసి “ఖిలాడీ” ని రూపొందించారు అంటూ ఓ నెటిజెన్ కామెంట్ చేసారు. ‘శత్రుంగ వేట్టై 1 ‘ తమిళ నాట సూపర్ హిట్ అయింది. ఆ సినిమానే తెలుగు లో బ్లఫ్ మాస్టర్ గా రీమేక్ చేసారు.
కాగా, రెండవ పార్ట్ 2017 లోనే విడుదల అవ్వాల్సి ఉంది. కానీ, అనుకోని కారణాల వలన విడుదల వాయిదా పడింది. అయితే.. ఇప్పుడు ఈ సినిమాకే కొన్ని మార్పులు చేసి “ఖిలాడీ” గా తీసారని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.
End of Article