Vikrant Rona Review : విక్రాంత్ రోణ సినిమాతో “కిచ్చ సుదీప్” పాన్-ఇండియన్ హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Vikrant Rona Review : విక్రాంత్ రోణ సినిమాతో “కిచ్చ సుదీప్” పాన్-ఇండియన్ హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya
  • చిత్రం : విక్రాంత్ రోణ
  • నటీనటులు : కిచ్చ సుదీప్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నిరూప్ భండారి, నీతా అశోక్, రవిశంకర్ గౌడ.
  • నిర్మాత : షాలిని జాక్ మంజు, అలంకార్ పాండియన్
  • దర్శకత్వం : అనుప్ భండారి
  • సంగీతం : అజనీష్ లోక్‌నాథ్
  • విడుదల తేదీ : జూలై 28, 2022

kiccha sudeep vikrant rona review

Video Advertisement

స్టోరీ :

కొంత మంది పిల్లలు ఒక వ్యక్తి గురించి కథ చెప్తూ ఉండడంతో సినిమా మొదలవుతుంది. ఒక ఊరిలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఎందుకు పిల్లలు కనిపించకుండా మాయం అవుతున్నారు? వారిలో ఒకరు పెద్దయిన తర్వాత ఎలా తిరిగొచ్చారు? అసలు విక్రాంత్ రోణ (కిచ్చ సుదీప్) ఎవరు? అతను ఏం చేస్తాడు? ఆ ఊరిలో జరిగే సమస్యలను ఎలా పరిష్కరించాడు? వీటన్నిటి వెనుక ఉన్నది ఎవరు? ఇదంతా తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

kiccha sudeep vikrant rona review

రివ్యూ :

కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ తెలుగులో కూడా అందరికీ తెలుసు. ఈగ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. అలాగే బాహుబలి సినిమాలో కూడా ఒక పాత్రలో నటించారు. ఆ తర్వాత నుండి సుదీప్ హీరోగా నటించిన చాలా వరకు సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి. ఇది సుదీప్ రెండవ పాన్-ఇండియన్ సినిమా. అంతకుముందు సుదీప్ హీరోగా నటించిన పహిల్వాన్ సినిమా కూడా పాన్-ఇండియన్ సినిమాగా విడుదల అయ్యింది.

kiccha sudeep vikrant rona review

ఇక సినిమా విషయానికి వస్తే, ఒక ఎడ్వంచరస్ డ్రామా అని మనకి ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. సినిమా చూస్తూ ఉన్నంతసేపు కొన్ని హాలీవుడ్ సినిమాలు గుర్తొస్తాయి. కథ బాగున్నా కూడా చిత్రీకరించే విధానంలో ఎక్కడో కొన్ని లోపాలు జరిగాయి ఏమో అనిపిస్తుంది. సినిమాలో నటించిన నటీనటులు అందరూ కూడా ఆ పాత్రకి తగ్గట్టుగా బాగా నటించారు. యాక్షన్ సీన్స్ కూడా చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారు. కాస్ట్యూమ్స్ కూడా సినిమాలో చూపించే టైం లైన్ కి తగ్గట్టుగా ఉన్నాయి. కానీ స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం ఫాస్ట్ గా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • సుదీప్
  • యాక్షన్ సీన్స్
  • నిర్మాణ విలువలు
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

  • బలహీనమైన టేకింగ్
  • స్లోగా సాగే స్క్రీన్ ప్లే
  • లాజిక్ మిస్ అయిన కొన్ని సీన్స్

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

ఒక యాక్షన్ అడ్వెంచరస్ డ్రామా చూడాలి అనుకునే వారికి, సినిమాపై ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే ఈ సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమా అవుతుంది.


You may also like