కల్కి 2898 ఏడీ అశ్వద్ధామ టీజర్‌లో… అమితాబ్ బచ్చన్ తో పాటు కనిపించింది అబ్బాయి కాదా..? ఇంతకీ ఈ అమ్మాయి ఎవరంటే..?

కల్కి 2898 ఏడీ అశ్వద్ధామ టీజర్‌లో… అమితాబ్ బచ్చన్ తో పాటు కనిపించింది అబ్బాయి కాదా..? ఇంతకీ ఈ అమ్మాయి ఎవరంటే..?

by Mohana Priya

Ads

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి ఎంతో మంది పెద్ద పెద్ద నటీనటులు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ అనే పాత్రలో నటిస్తున్నారు. ఆ పాత్రకి సంబంధించిన టీజర్ నిన్న విడుదల చేశారు. ఇందులో అశ్వద్ధామ దగ్గరికి ఒక అబ్బాయి వచ్చి, “ఎవరు నువ్వు?” అని అడుగుతాడు. అప్పుడు అశ్వద్ధామ తాను ఎవరో చెప్తారు. ఈ టీజర్ ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటున్నారు. సినిమా మీద ఆసక్తి ఈ టీజర్ వల్ల ఇంకా పెరిగింది.

Video Advertisement

kid with amitabh bachchan in kalki 2898 ad aswatthama intro teaser

అయితే, ఇందులో ఉన్నది అబ్బాయి అని అందరూ అనుకుంటున్నారు. కానీ అక్కడ ఉన్నది అబ్బాయి కాదు. అమితాబ్ బచ్చన్ తో మాట్లాడేది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు సినిమాలో రాయ. రాయ అంటే వెలుగు అని అర్థం. దీపికా పదుకొనే పోస్టర్ విడుదల చేసేటప్పుడు వెలుగు అని అర్థం వచ్చేలాగా ఒక క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ టీజర్ లో ఉన్న చిన్న పిల్ల దీపికా పదుకొనే అని అంటున్నారు. ఈ అమ్మాయి పేరు కేయా నాయర్. నిన్న టీజర్ విడుదల అయ్యాక అందరూ కేయా నాయర్ ని ట్యాగ్ చేసి, టీజర్ బాగుంది అంటూ పోస్ట్ చేశారు.

kid with amitabh bachchan in kalki 2898 ad aswatthama intro teaser

ఇవన్నీ కూడా కేయా నాయర్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పెట్టుకున్నారు. అప్పుడే అందరికీ అక్కడ ఉన్నది అమ్మాయి అని అర్థం అయ్యింది. అయితే, కేయా నాయర్ ఎవరి పాత్ర పోషిస్తుంది అనేది మాత్రం ఇంకా తెలియదు. సినిమాకి సంబంధించిన ఏ ఒక్క వివరం కూడా బయటికి రానివ్వట్లేదు. థియేటర్ లో సినిమా ఎక్స్పీరియన్స్ చేయాలి అనే ఉద్దేశంతో టీజర్ లో కూడా ఎక్కువ విషయాలను చూపించట్లేదు. ఇటీవల ప్రభాస్ పేరు భైరవ అని ప్రకటిస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ పోషిస్తున్న అశ్వద్ధామ పాత్రని పరిచయం చేస్తూ ఒక టీజర్ విడుదల చేశారు.

ALSO READ : 7/G బృందావన్ కాలనీ సినిమాలో ఈ సీన్ గమనించారా..? హీరోయిన్ ఓడిపోయినా కూడా హీరో ఎందుకు ఆనందపడతాడంటే..?


End of Article

You may also like