రాజా వారు రాణి గారు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం వరుస చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అందులోనూ ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యే కంటెంట్ తో గ్యాప్ లేకుండా మూవీస్ రిలీజ్ చేస్తున్నాడు. అయితే వచ్చే ఏడాది కూడా కిరణ్ అబ్బవరం ఇదే జోష్ కొనసాగిస్తాడని సమాచారం.

Video Advertisement

2019లో వచ్చిన ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో హీరోగా ఆరంగేట్రం చేశాడు కిరణ్ అబ్బవరం.అమాయకత్వంతో కూడిన తన నటనతో మంచి మార్కులు వేయించుకున్నాడు.ఈ మూవీ డీసెంట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత 2021 లో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్న ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ కిరణ్ అబ్బవరం రేంజ్ ను ఒక్కసారిగా పెంచేసింది. కరోనా టైంలో సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించారు దర్శక నిర్మాతలు. అయితే సెకండ్ లాక్ డౌన్ తర్వాత విడుదలైన ఈ సినిమా సక్సెస్ అందుకుని థియేటర్లకు పూర్వ వైభవాన్ని తెచ్చిన సినిమాగా నిలిచింది.

hero kiran-abbavaram

టాలెంట్ అనేది ఉంటే ఏరంగంలోనైనా నిలదొక్కుకోవచ్చు. అయితే సినిమా రంగంలో టాలెంట్ పాటు లక్ కూడా కావాలి. కిరణ్ అబ్బవరం షార్ట్ ఫిల్మ్స్ నుంచి కెరీర్ ను స్టార్ట్ చేసి, ప్రస్తుతం ఫుల్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో దూసుకుపోతున్నాడు.కిరణ్ హిట్ అయినా, ఫ్లాప్ అయినా సినిమాల విడుదల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు.ఈ యంగ్ హీరో వరుస సినిమాలను విడుదల చేస్తునే ఉన్నాడు.

ఈ ఏడాది లో మూడు చిత్రాలను విడుదల చేశాడు. తన మూడో సినిమా కాన్సెప్ట్ బేస్డ్ థ్రిల్లర్ గా ‘సెబాస్టియన్ పిసి 524’తో వచ్చాడు. ఈ సినిమాలో అతను నైట్ బ్లైండ్డ్ పోలీసు పాత్రలో నటించాడు.ఈ మూవీ కమర్షియల్ గా హిట్ అవలేదు. ఆ తరువాత మే 24న‘సమ్మతమే’ విడుదలై హిట్ అయ్యింది. సెప్టెంబర్ 16న విడుదలైన ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ డిజాస్టర్‌గా నిలిచింది.

actor kirana abbavaram

అయినా కూడా కిరణ్ జోష్ ఏమాత్రం తగ్గలేదు. హిట్టు, ఫ్లాప్ లను బ్యాలెన్స్ చేస్తూ వెళ్తుండటంతో అతని చేతినిండా సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజా అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం కిరణ్ చేతిలో పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఏఎమ్ రత్నం & ఏషియన్ సినిమాస్, గీతా ఆర్ట్స్ వంటి బ్యానర్‌లతో త్వరలో సినిమాలు రాబోతున్నట్టు తెలుస్తున్నాయి. ఈ ఏడాదిలాగే వచ్చే ఏడాది (2023)లోనూ కిరణ్ అబ్బవరం ఫుల్ బిజీగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అయితే వీటిలో ఒకటో, రెండు హిట్ అయినా ఈ హీరోకి స్టార్ స్టేటస్ దక్కుతుంది.