Ads
హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కాంతార’ హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. సప్తమి గౌడ కథానాయిక. కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే కన్నడలో విడుదలై విజయం సాధించిన ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు నిర్మాత అల్లు అరవింద్.
Video Advertisement
కర్ణాటకలోని ఓ తెగకు సంబంధించిన ఇతివృత్తం ఆధారంగా వచ్చిన ఈ చిత్రంలో గుడ్ ఎమోషన్స్, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సెన్స్ ఉన్నాయి. దేవ నర్తకుడు మరియు శివ పాత్రల్లో రిషబ్ శెట్టి ఎప్పటిలాగే తన పరిపక్వతమైన నటనతో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు. ఈ భారీ యాక్షన్ విజువల్ డ్రామాలో బరువైన భావోద్వేగాలు, ప్రాంతీయ దైవత్వం తాలూకు నమ్మకాలు, ఇక గుడ్ యాక్షన్ తో సాగే ఎమోషనల్ సీన్స్ మరియు అద్భుతమైన క్లైమాక్స్.. ఈ సినిమాలో బాగా అలరిస్తాయి.
దర్శకుడు రిషబ్ శెట్టి సినిమాలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు మెయిన్ ఎమోషన్స్ ను కూడా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ముఖ్యంగా దర్శకుడు రిషబ్ శెట్టి సినిమా ముగింపులో చక్కని దర్శకత్వ పనితనం కనబర్చాడు. క్లైమాక్స్ చాలా బాగుంది. దీంతో తెలుగు లో కూడా మంచి టాక్ తో దూసుకుపోతోంది ఈ చిత్రం.
అయితే అసలు ‘కాంతార’ అంటే అర్థం ఏంటి అని అందరు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యం లో తాజాగా ఒక ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి మాట్లాడుతూ .. కన్నడలో ‘కాంతార’ అంటే మిస్టీరియస్ ఫారెస్టు అని అర్థం. ప్రకృతికి .. మానవుడికి మధ్య జరిగే ఘర్షణ ఇది. తమిళనాడులో జల్లికట్టు మాదిరిగానే, కర్ణాటకలో ‘కంబళ’ అనే క్రీడ ఉంది. కథలో ఆ నేపథ్యం కూడా ప్రధానంగానే కనిపిస్తుంది.
ఈ సినిమాకి నేను హీరోను మాత్రమే కాదు, రైటర్ ను .. డైరెక్టర్ ను.. అయినా నాకు ఎక్కువ టెన్షన్ అనిపించలేదు. కథకి ఎక్కడ ఏం కావాలో అది ఇస్తూ వెళ్లాను. అలాగే నా సినిమాల నుంచి ఆడియన్స్ ఏం ఆశిస్తారో ఆ అంశాలు తగ్గకుండా చూసుకుంటూ వెళ్లాను. అందువలన నాకు పెద్దగా కష్టంగా అనిపించలేదు.” అని రిషబ్ చెప్పుకొచ్చారు.
End of Article