Ads
పెళ్లి ప్రతి ఒక్కరి జీవితం లో ఎంతో ముఖ్యమైన భాగం. కానీ ఒక మహిళకు ఈ పెళ్లి తో కూడా ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. ప్రపంచం ఎంత ముందుకు వెళ్తున్నా.. మారనిది ఏమైనా ఉంది అంటే అది స్త్రీ కి దురయ్యే సవాళ్ళే..పుట్టినప్పటి నుంచి వారు వద్దు, కూడదు అన్న మాటలే ఎక్కువగా వింటూ ఉంటారు.
Video Advertisement
అయితే ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తో ఆనందం గా జీవిస్తున్న తరుణం లో.. విధి వక్రీకరించి తన భర్తను దూరం చేస్తే.. ఒక మహిళ జీవితం ఎలా మారిపోయిందో.. ఆమె ఎన్ని ఇబ్బందులు పడిందో ఇప్పుడు చూద్దాం..
గంగ కోనసీమ దగ్గర్లోని ఒక టౌన్ లో ఉండేది. సెలవులు వచ్చిన ప్రతిసారి దగ్గలో ఉండే అమ్మమ్మ గారి పల్లెటూరికి వెళ్ళేది. అలాగే 10 వ తరగతి చదువుతూ ఉన్న సమయం లో కూడా ఒకసారి ఆ ఊరికి వెళ్ళింది. అప్పుడు ఒక యువకుడు తనని ప్రేమిస్తున్న అంటూ వెంటపడ్డాడు. జీవితానికి సంబంధించిన పెద్ద నిర్ణయాలు తీసుకొనే వయసు కాదు అని ప్రేమని తిరస్కరించింది. అయితే అతడు ఆమె వెంట పడుతూనే ఉన్నాడు.
అయితే గంగ 10 వ తరగతి పూర్తి కాగానే.. నకి పెళ్లి సంబధాలు చూడడం మొదలు పెట్టారు. అప్పుడు తనని ప్రేమించిన యువకుడు వాళ్ళ ఇంట్లో తన ప్రేమ విషయం చెప్పి.. ఒప్పుకోకపోతే చచ్చిపోతే అని బెదిరించి..గంగ వాళ్ళ పెద్దలతో కూడా మాట్లాడి పెళ్లి చేసుకున్నాడు. అంతా బాగానే ఉంది ఒక పాప కూడా పుట్టింది. పెళ్లికి ముందు అబ్బాయి ఆ అమ్మాయి నీ ఎంత ప్రేమించాడో, అంతకన్న ఎక్కువ పెళ్ళి అయ్యాక ఆమ్మాయి ప్రేమించింది.
పాపకి ఒక సంవత్సరం వయసు వచ్చిన తర్వాత గంగ మరోసారి తల్లి కాబోతుంది అని తెలిసింది. కుటుంబం పెరుగుతుంది అని సంబరపడ్డారు. కానీ అనుకోకుండా ఆమెకు అబార్షన్ అయ్యింది. భార్యాభర్తలు ఆ బాధని భరించ లేక పోయారు. ఇద్దరు ఇంట్లోనే ఉంటూ బాధపడుతూ ఉన్నారు. అయితే ఒక రోజు అతడి స్నేహితులు ఇంటికి వచ్చి.. ‘ఇద్దరు ఇలా ఉంటే ఎలా.. నువ్వే బాధ పడుతూ ఉంటే మా చెల్లిని ఎవరు ఓదారుస్తారు, పదా అలా తినటానికి బయటకి వెళ్లి తనకి ఏమైనా తినటానికి ఇంటికి తీసుకుని వద్దువు గాని..’ అని చెప్పి ఆ యువకుడిని బయటకి తీసుకెళ్లారు.
కానీ అనుకోని విధంగా లారీ ఆక్సిడెంట్ అయ్యి ముగ్గురు మరణించారు. విషయం తెలిసిన ఆ అమ్మాయి తన భర్త లేడని తట్టుకోలేక కృంగి పోయింది. అంతే కాకుండా అత్తవారింటి సపోర్ట్ కూడా ఆమెకు దక్కలేదు. ‘కేవలం మా కొడుకు కోసం నిన్ను కోడలిగా ఒప్పుకున్నాం ..కానీ ఇప్పుడు కొడుకే లేడు.’ అని గంగ ని ఇంటి నుంచి వెళ్లగొట్టారు. ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారాన్ని కూడా వాళ్లే తీసుకున్నారు.
ఆ సమయం లో న తల్లిదండ్రులు నన్ను అక్కున చేర్చుకున్నారు. కానీ నేను నా బాధ నుంచి బయట పడలేకపోయాను. ఒకే గదిలో నన్ను నేను బంధించుకున్నాను. కానీ కొంత కాలానికి నా బిడ్డ గురించి ఆలోచన మొదలైంది. మా ఇద్దరి భవిష్యత్తు గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాను. పుట్టింటి వాళ్ళని ఒప్పించి.. నర్సింగ్ చదివి.. ప్రస్తుతం ఒక ఉద్యోగం సాధించుకుంది. ప్రస్తుతం తన కాళ్ళ మీద తాను నిలబడి తన జీవితాన్ని తన చేతిలోకి తీసుకొని సంతోషం గా జీవిస్తోంది గంగ. చిన్న చిన్న విషయాలకే ప్రాణం తీసుకొనే ఈ సమాజం లో ఈమె జీవితం అందరికి ఆదర్శం.
End of Article