ఆ మూవీలో అనసూయను పెట్టి ఏం చెప్పారు..? అంటూ కొలికపూడి శ్రీనివాసరావు కామెంట్స్..!

ఆ మూవీలో అనసూయను పెట్టి ఏం చెప్పారు..? అంటూ కొలికపూడి శ్రీనివాసరావు కామెంట్స్..!

by kavitha

Ads

ఇటీవల వచ్చిన యాత్ర 2, రాజధాని ఫైల్స్ వంటి చిత్రాల పై ఓ న్యూస్ ఛానెల్‌లో జరిగిన చర్చలో,  రైతు నాయకుడు మరియు తెలుగుదేశం పార్టీ అనుకూల నాయకుడు అయిన కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Video Advertisement

ఈ సందర్భంగా ఆయన యాత్ర మరియు యాత్ర 2 చిత్రాలు వాస్తవాలకు దూరంగా తెరకెక్కించారని, అందువల్ల ప్రజలు వాటిని నమ్మడం లేదని అన్నారు.  ఈ క్రమంలో వైఎస్ జగన్, యాత్ర మూవీలోని అనసూయ సీన్ గురించి చెప్తూ, ఘాటు వాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ” 2019 ఎలెక్షన్స్ ముందు తెరకెక్కించిన యాత్ర అబద్దం, యాత్ర మూవీలోని నేనున్నాను, నే విన్నాను అనే డైలాగ్ పాపులర్ అయ్యింది. అయితే యాత్ర 1 లో బాగా పాపులర్ అయిన మరో డైలాగ్  ఏమిటంటే, పాణ్యం సరితా రెడ్డి క్యారెక్టర్ లో అనసూయను పెట్టి, సహాయం కోసం వచ్చిన ఆడబిడ్డతో రాజకీయం చేయడం ఏంటి? అనే ఓ డైలాగ్ ఉంది. మరి ఈ రోజు షర్మిలతో మీరు చేస్తున్నదేమిటి, ఆమె పెళ్లి గురించి మీరు మాట్లాడుతున్నదేమిటి? ఆమె భర్త గురించి మాట్లాడుతున్నదేమిటి?

ఆమె కుటుంబం గురించి మీరు మాట్లాడుతున్నదేమిటి? ఆమె ఇంటిపేరు గురించి మీరు మాట్లాడుతున్నదేమిటి? బాబాయి కూతురును, తండ్రి హత్యలో బాబాయి కూతురును హంతకురాలని మీరు ప్రచారం చేసి, ఛానెల్ లో చూపించి, పేపర్లో రాసి, మీరు అక్కాచెల్లెలకు ఏం చేశారు” అంటూ ప్రశ్నించారు. యాత్ర 2 మూవీ అనేది వైఎస్ జగన్‌కు ఎంత మాత్రం ఉపయోగపడదు అంటూ కొలికపూడి శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

కాగా, యాత్ర మూవీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా చూపించారు. యాత్ర 2 మూవీలో వైఎస్ జగన్ జీవిత చరిత్ర కథతో రూపొందించారు. ఇటీవలే రిలీజ్ అయిన యాత్ర 2 మూవీకి మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో   వైఎస్  రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటించగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటించారు.

Also Read: వైయస్ షర్మిలకి కాబోయే కోడలి తల్లిదండ్రులు ఎవరో తెలుసా..? ఆ అమ్మాయి తండ్రి ఏ ఉద్యోగం చేస్తారంటే..?


End of Article

You may also like