Ads
రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?
Video Advertisement
వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. అంత పెద్ద స్టార్ హీరోలని ఒకే తెరపై చూడటం కూడా ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది.
ముఖ్యంగా వారి మధ్య వచ్చే సీన్స్ చాలా మందిని ఎమోషనల్ చేశాయి. వీరిద్దరూ మొదటిసారి కలుసుకునే సీన్ కూడా చాలా బాగా తీశారు. నిజంగానే వారిద్దరినీ చూస్తూ ఉంటే పెద్ద హీరోల్లాగా కాకుండా ఆ పాత్రల్లాగానే కనిపిస్తూ ఉంటారు. అయితే సినిమాకి సంబంధించి అంతకుముందు రిలీజ్ చేసిన వీడియోస్ లో కనిపించిన సీన్స్ సినిమాలో మిస్ అయ్యాయి. అంతే కాదు కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన సీన్లను కూడా కొన్ని డిలీట్ చేసేసారు.
ఇప్పుడు ఏమేమి సీన్స్ డిలీట్ చేశారో ఓ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటర్వెల్ తరువాత ఎన్టీఆర్ ది ఒక సీన్ రావాల్సి ఉందట. ఆ సీన్ ని థియేటర్ ప్రింట్ లో డిలీట్ చేసేసారు. కొమరం భీమ్ ప్రామిస్ చేస్తూ ఒక సీన్ ఉంటుందట. ఈ సీన్ కూడా ఫైనల్ వెర్షన్ లో లేదు. ఇక కొమరం భీమ్ జైలులో ఉన్న సీన్, క్లైమాక్స్ లో టర్బన్ లుక్ లో ఉన్న ఓ సీన్ ను కూడా ఫైనల్ వెర్షన్ నుంచి తీసేసారు. ఇన్ని ఎన్టీఆర్ సీన్లను తీసేయడంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంచం అప్ సెట్ అయ్యారు. అయితే.. ఇవి కనీసం ఓటిటిలో అయినా పెట్టాల్సింది కదా అని ప్రశ్నిస్తున్నారు.
End of Article