Ads
గంధపు చెక్కల స్మగ్లర్ గా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వీరప్పన్ పేరు వినని ఇండియన్స్ ఉండరని చెప్పవచ్చు. వీరప్పన్ జీవితం ఆధారంగా ఇప్పటికే పలు చిత్రాలు, డాక్యుమెంటరీలు తెరకెక్కాయి. వీరప్పన్ లైఫ్ లోని మరిన్ని సీక్రెట్స్ చెబుతామంటూ ఒక వెబ్ సిరీస్ తెరకెక్కింది.
Video Advertisement
కూసే మునిస్వామి వీరప్పన్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ డిసెంబర్ 14 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటుగా తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
ఈ సిరీస్ కి శరత్ జోతి దర్శకత్వం వహించగా, ప్రభావతి నిర్మించారు. వీరప్పన్ స్వయంగా చెప్పిన విషయాల ఆధారంగా ‘కూసీ మునుసామి వీరప్పన్’ డాక్యుమెంటరీ సిరీస్ ను రూపొందించారు. 1993-1996 కాలంలో వీరప్పన్ ఇంటర్వ్యూ కోసం గోపాల్ అనే విలేకరి అడవిలోకి వెళ్లి, తీసిన వీడియోలు, తన గురించి తానే వీరప్పన్ చెప్పిన దాని ఆధారంగా ఆరు ఎపిసోడ్ లతో ఈ సిరీస్ను తెరకెక్కించారు.
ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, స్వయంగా వీరప్పన్ తన గురించి, తన లైఫ్ గురించి వివరించారు. వేటగాళ్ల ఫ్యామిలిలో కూసే మునిసామి వీరప్పన్ ఐదుగురు పిల్లలలో రెండో అబ్బాయిగా జన్మించాడు. చిన్నవయసులో తన ఆకలిని తీర్చుకోవడానికి కుటుంబ వృత్తి వేటాడడం ప్రారంభించాడు. మొదట్లో ఆకలి తీర్చుకోవడం కోసం వేటాడినా, కాలక్రమేణా దాని వల్ల కోట్ల రూపాయలు సంపాదించాడు. వీరప్పన్ దశాబ్దాల పాటు తమిళనాడు, కర్ణాటక బార్డర్ లోని అడవులను దోచుకున్నాడు.
వీరప్పన్ కనిపించిన గంధపు చెట్టునల్లా అమ్మడం, ఏనుగులను చంపి వాటి దంతాలు కూడా అమ్మడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో వీరప్పన్ వందలాది మందిని చంపేశాడు. అంతేకాకుండా తనకు వ్యతిరేకంగా ఉన్న పోలీసు ఆఫీసర్లను, పోలీస్ ఇన్ఫార్మర్ అనే సందేహం కలిగినా కూడా చంపేశాడు. తను ఇంతగా ఎందుకు మారాడు? వీరప్పన్ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను గురించి తానే స్వయంగా చెప్పాడు. ఆ విషయాలన్ని తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే..
Also Read: DUNKI REVIEW : “షారుఖ్ ఖాన్” కి ఈ సినిమాతో మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
End of Article