సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఈ “కోపదారి మనిషి” ఎవరో తెలుసా..? ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే..?

సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఈ “కోపదారి మనిషి” ఎవరో తెలుసా..? ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే..?

by Mounika Singaluri

సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎంతో మంది వైరల్ అవుతూ ఉంటారు. ఒకరు ఒక డైలాగ్ చెప్పు వైరల్ అవుతుంటే ఒకరు బిహేవియర్ వల్ల వైరల్ అవుతూ ఉంటారు. మరికొందరైతే వాళ్ల యాసబట్టి భాష బట్టి వైరల్ అవుతూ ఉంటారు.

Video Advertisement

అనుకోకుండా అలా సెలబ్రిటీలు అయినవారు చాలామంది ఉన్నారు. గతంలో ఒక మనిషి వార్తలు చదువుతూ తన తిట్టిన బూతులు వల్ల… తన కోపం వల్ల చాలా ఫేమస్ అయ్యాడు… ఆయనకి కోపదారి మనిషి అంటూ పేరు పెట్టారు… మీకు గుర్తు వచ్చి ఉంటాడు… అసలు ఇప్పుడైనా ఏం చేస్తున్నారు? తెలుసుకుందాం…!

kopadari manishi present picture

“ఎవరండీ ఇది రాసింది… కామన్ సెన్స్ ఉండాలని… ఆ నెక్స్ట్ అండి… చదివే ఇంట్రెస్ట్ ఆసక్తి మొత్తం పోతుంది…. వివేకంతో ఆలోచించండి…” ఈ డైలాగులు అన్ని ఎక్కడో విన్నట్టు ఉన్నాయి కదా… ఇవన్నీ కోపదారి మనిషైనా ఒక రిపోర్టర్ మాట్లాడిన మాటలు… న్యూస్ చదివే ముందు ప్రాక్టీస్ చేసేటప్పుడు న్యూస్ పేపర్ సరిగ్గా రాయలేదని పక్కనున్న స్టాప్ మీద కోపం తెచ్చుకొని తిట్టగా ఆ వీడియో కాస్త బయటకు వచ్చి చాలా వైరల్ అయిపోయారు. అయన అసలు పేరు కృష్ణమోహన్.

kopadari manishi present picture

ప్రస్తుతం ఆయన సింగం టీవీ అని యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. తాజా రాజకీయ విశ్లేషణలు పైన వీడియోలు చేస్తూ తన అభిప్రాయాన్ని వెళ్లబుచ్చుతున్నారు. ఏ ఒక్క పార్టీకి ముగ్గు చూపకుండా అందరికీ సమానంగా తనకు తోచిన విధానం వార్తలు ప్రజలకి చేరవేస్తున్నారు. ఆయన వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు జర్నలిజం అంటే ఇలా ఉండాలి అంటూ మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. కోపదారి మనిషిగా చాలా ఫేమస్ అయిన ఈ కృష్ణమోహన్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబర్స్ కూడా బాగానే ఉన్నారు. తన వీడియోలకు వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి


You may also like

Leave a Comment