Ads
ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి కోట శ్రీనివాసరావు పాపులర్ అయ్యారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, కమెడియన్ గా ఎన్నో పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు కోట, వయసు మీద పడడంతో ఈమధ్య సినిమాలు తగ్గించేశారు.కోట శ్రీనివాసరావు తాజాగా ఇంటర్వ్యూ లో ఈ విషయాలని చెప్పారు.
Video Advertisement
తనకు కడుపు కోత మిగిల్చిన కొడుకు చావును గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఇండస్ట్రీలో నిలబడాలంటే మంచి అనుభవం ఉన్న వారి ప్రోత్సాహం అవసరమని అన్నారు. అందుకనే జె.డి.చక్రవర్తి, జగపతిబాబు మా అబ్బాయిని ప్రోత్సహించారని అన్నారు.
గాయం- 2 సినిమాలో కోట శ్రీనివాసరావు కొడుకు ఒక వేషం వేయాల్సి వచ్చింది. ఆ సీన్ లో తాను పాడె మీద పడుకోవాలి. లొకేషన్ లో పాడె కూడా రెడీ చేశారు. ఎంతైనా కన్న కొడుకుని అలా చూడడం బాధగా అనిపించి జగపతిబాబుతో ఈ విషయాన్ని కోట శ్రీనివాసరావు పంచుకున్నారట.
అలా పాడె మీద చూడలేం అయ్యా తలుచుకుంటేనే కాస్త వణుకు వచ్చేస్తోంది. వాడిని అలా చూస్తే నేను పాత్రని చేయలేను అన్నారు. మరి ఏం పర్వాలేదు రిలాక్స్ అవ్వండి అంటూ కోట శ్రీనివాసరావుకి జగపతి బాబు ధైర్యం చెప్పారు. ఏ ముహూర్తాన ఆ మాట అన్నానో కానీ వారం రోజుల్లో కొడుకు పోయాడు. ఎలా చూడకూడదు అనుకున్నానో అలానే చూడాల్సి వచ్చింది అని కోటా అన్నారు.
End of Article