కొత్త బంగారులోకం హీరోయిన్ కొత్త రూపం….మరీ ఇంతలా మారిపోయిందేంటి…అంటున్న నెటిజన్స్

కొత్త బంగారులోకం హీరోయిన్ కొత్త రూపం….మరీ ఇంతలా మారిపోయిందేంటి…అంటున్న నెటిజన్స్

by Megha Varna

Ads

సినిమాలో నటించిన హీరోయిన్లు కొన్ని రోజులకి గుర్తుపట్టలేనట్టుగా మారిపోవడం ఈ మధ్య చాలా ట్రెండ్ గా నడుస్తుంది. ఈ క్రమంలో కొత్త బంగారులోకం మూవీ లో పుష్టిగా కనిపించిన హీరోయిన్ లేటెస్ట్ గా తన జీరో సైజ్ ఫోటోలు పెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది.

Video Advertisement

కుర్ర కారును ఒక ఊపు ఊపిన చిత్రం కొత్త బంగారులోకం. ఈ సినిమాలో తెలుగు తెరకు పరిచయమై” ఎక్కాడ ….ఎక్కాడ” అనే డైలాగ్ తో తెగ పాపులర్ అయిన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో రిలీజ్ అయిన ఈ సినిమాతో కుర్ర కారులో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత సినిమాల్లో ఆ ఇంపాక్ట్ నిలుపుకో లేకపోయింది. తెలుగులో సరైన అవకాశాలు హిట్స్ దొరక్క తమిళ్ , హిందీ పరిశ్రమలకు తరలిపోయింది.

Also Read:   చనిపోతున్న తన భార్య చివరి కోరిక తీర్చిన భర్త..రియల్లీ హ్యాట్సాఫ్.! ఇంతకీ ఆమె ఏం కోరిందంటే.?

కానీ తను ఆశించినట్లుగా తమిళ్లో కానీ హిందీలో కానీ హిట్లు సంపాదించలేక క్రమేపి ఫిలిం ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోయింది. మరోపక్క పర్సనల్ గా కూడా తన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. 2018లో తను ప్రేమిస్తున్న రోహిత్ మిట్టలను పెళ్లాడిన ఈమె పరస్పర అభిప్రాయ విభేదాల వల్ల పెళ్లైన సంవత్సరానికే విడాకులు తీసుకుంది.

నటన ఆపిన చాలా కాలం తర్వాత ఈమధ్య సినిమా ల పట్ల తిరిగి ఆసక్తి చూపుతున్న ఆమె చివరిగా విజేత సినిమాలో తలుక్కుమంది. సినిమాల్లో నటించక పోయినప్పటికీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు వీడియోలు పోస్ట్ చేసి అభిమానులకు ఎప్పుడు ఆమె చేరువుగా ఉంది.

ఈ క్రమంలో తాజాగా ఆమె షేర్ చేసిన హాట్ ఫోటోలను చూసి కొత్త బంగారులోకం సినిమాలో బొద్దుగా అమాయకంగా కనిపించిన హీరోయిన్ తననే అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు చాలామంది అయితే ఆ ఫోటో చూసి తనను గుర్తుపట్టలేకపోయారు.

Also Read: “సుహాసిని” నుండి… “నయనతార” వరకు… “డైరెక్టర్స్”ని పెళ్లి చేసుకున్న 9 మంది హీరోయిన్లు..!


End of Article

You may also like