కొన్ని రోజుల కిందట సూపర్ స్టార్ కృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణ మరణంతో మహేశ్‌ బాబు కుటుంబ సభ్యులు దుఃఖంలో మునిగిపోయారు. దానికి కొన్ని రోజుల క్రితం మహేశ్‌ తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. ఈ ఏడాది మొదట్లోనే కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్‌ బాబు కూడా ఈ లోకాన్ని విడిచాడు. మహేశ్ బాబుకు ఈ ఏడాది అంతులేనటు వంటి విషాదాన్ని మిగిల్చింది. తెలుగు చిత్రసీమ కదలివచ్చి సూపర్‌స్టార్‌ కృష్ణకు నివాళులర్పించింది.

Video Advertisement

కృష్ణ మరణం తరవాత ఆయనకి సంబందించిన విషయాలు ఒక్కొక్కటి బయటకి వస్తున్నాయి. తాజాగా మరో విషయం బయట పడింది. ఇక మరి ఆ విషయం కోసం చూస్తే..

హీరోలు కథని విని ఆ తర్వాత ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అయితే అన్ని సినిమాలు హిట్ అవ్వాలని ఏమీ లేదు. హిట్ అవుతుందని అనుకున్న సినిమా కూడా ఒక్కొక్కసారి ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సినిమాల విషయంలో గ్యారెంటీగా హిట్ అవుతుందని మనం అనుకుంటే సరిపోదు. ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎంత పెద్ద హీరోకైనా సరే ప్లాప్స్ సహజం. అయితే మహేష్ బాబు కి కూడా సినిమాల్లో కొన్ని ప్లాప్స్ వచ్చాయి. మహేష్ సినిమాల విషయంలో కృష్ణ జడ్జిమెంట్ చాలా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉంటుంది.

సినిమా హిట్ అవుతుందా లేదంటే సినిమా ఫ్లాప్ అవుతుందా అనేది కృష్ణ కరెక్ట్ గా చెప్పేస్తారట. మురారి సినిమా విషయానికి వస్తే కృష్ణ మహేష్ బాబు భుజంపై చేయి వేసి ఎంతో గర్వపడ్డారట. నాని సినిమా మాత్రం ప్లాప్ అవుతుందని కృష్ణకి ముందే తెలిసిపోయింది. కృష్ణ అనుకున్నట్లుగానే నాని సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాని ముందు చూసిన కృష్ణ ఏమి మాట్లాడలేదట. ఆ తర్వాత ఈ సినిమా హిట్ అయింది అంటే మహేష్ స్టార్ కాదు ఫ్లాప్ అయితేనే మహేష్ స్టార్ అని అన్నారట. ఆయన చెప్పినట్లే ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.