షూటింగ్ కి వెళ్ళి అండ‌మాన్ దీవుల్లో చిక్కుకున్న కృష్ణ‌, కృష్ణంరాజు, బాల‌కృష్ణ‌.. వేటితో తమ ప్రాణాల‌ను కాపాడుకున్నారో తెలుసా?

షూటింగ్ కి వెళ్ళి అండ‌మాన్ దీవుల్లో చిక్కుకున్న కృష్ణ‌, కృష్ణంరాజు, బాల‌కృష్ణ‌.. వేటితో తమ ప్రాణాల‌ను కాపాడుకున్నారో తెలుసా?

by kavitha

Ads

నంద‌మూరి నట సింహం బాల‌కృష్ణ గురించి అందరికి తెలిసిందే. బాలయ్య ఏ మూవీ చేసినా అది సంచలనం అనే చెప్పవచ్చు. 1999లో వచ్చిన బాల‌కృష్ణ ‘సుల్తాన్’ సినిమా గురించి తెలిసిందే. ఈ మూవీ యావ‌రేజ్‌గా నిలిచింది. ఈ సినిమాలో కృష్ణ‌, కృష్ణంరాజు, బాల‌కృష్ణ‌లు పోటీ ప‌డి న‌టించారు. బాల‌కృష్ణ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించారు. హీరో మరియు విల‌న్ పాత్రలలో న‌టించి ఆడియెన్స్ ని అలరించారు.

Video Advertisement

సూప‌ర్ స్టార్‌ కృష్ణ పోలీస్ ఆఫీస‌ర్ గా, సిబిఐ ఆఫీసర్ గా రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు ఇద్ద‌రు కూడా అద్భుతంగా న‌టించారు. ఇలా ముగ్గురు అగ్ర హీరోలు నటిస్తుండడంతో రిలీజ్ కు ముందే ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ ట్రైల‌ర్ లో బాలకృష్ణ డిఫరెంట్ గెటప్స్ చూసి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నారు.  కానీ యావరేజ్ గా నిలిచింది. ఈ చిత్రం కోసం డైరక్టర్ శ‌ర‌త్ మరియు రచయితలు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ట‌. ముగ్గురు అగ్ర హీరోలే కావడంతో ఎవ‌రి ఇమేజ్‌కి తగిన విధంగా వారి క్యారెక్టర్స్ ని డిజైన్ చేశారు.
బాల‌కృష్ణ ఈ మూవీ షూటింగ్‌ విషయంలో సీనియ‌ర్ హీరోలైన కృష్ణ‌, కృష్ణంరాజుల‌కు చెందిన పార్ట్ ను ముందుగా చేద్దామ‌ని చెప్పడంట. అయితే ఆ పార్ట్ షూటింగ్ అండ‌మాన్ దీవుల్లో ప్లాన్ చేయడంతో కుటుంబాలతో ట్రిప్ లగా స‌ర‌దాగా ఉంటుంద‌ని ముగ్గురు హీరోలు తమ ఫ్యామిలీలను తీసుకొని అండ‌మాన్ కి వెళ్లార‌ంట‌. అక్కడి లొకేష‌న్లు బాగున్నా, ఉండేందుకు రాజీవ్ గాంధీ గెస్ట్ హౌజ్ మాత్రమే ఉందంట.  తప్పక అందులోనే అంద‌రూ అడ్జ‌స్ట్ అయ్యారంట. ఇక అక్కడ తిన‌డానికి ఆహారం కూడా దొరికలేదంట. వెళ్లిన రోజు తమతో పాటు తీసుకెళ్లిన  బిస్కేట్లు, చిరుతిండ్ల‌తో గ‌డిపారంట
మరుసటి  రోజు ఎక్క‌డి నుండో రైస్, కూర‌గాయలు తెప్పించుకున్నారంట. వాటితో విజ‌య నిర్మ‌లగారు అద్భుతంగా  వంట చేయడంతో అంద‌రు తిన్నార‌ట‌. ఇక బాల‌య్య చేప‌ల‌ని వేటాడీ తీసుకు రావడంతో  విజ‌య నిర్మ‌ల‌ వాటితో చేప‌ల పులుసు చేసిందంట. ఆ చేప‌ల పులుసు అద్భుతంగా ఉండడంతో  మూవీ యూనిట్ అందరికి రుచి చూపించారంట. అందరు లొట్టలేసుకుంటూ తిన్నార‌ట‌. దాంతో తెలుగు ఇండ‌స్ట్రీలో విజ‌య‌నిర్మ‌ల గారి చేప‌ల పులుసు ఫేమస్ అయ్యింది.
Also Read: “కళాతపస్వి కె.విశ్వనాథ్” తెరకెక్కించిన “సప్తపది” హీరో గుర్తున్నారా..?? ఇప్పుడెలా ఉన్నారో తెలుసా..??


End of Article

You may also like