కళాతపస్వి కె.విశ్వనాథ్ తెలుగు తెరకు ఆణిముత్యాల వంటి ఎన్నో సినిమాలను అందించారు. సంగీతం .. సాహిత్యం .. నృత్యం ప్రధానంగా ఆయన అల్లుకున్న కథలు .. అందించిన చిత్రాలు నేటికీ ప్రేక్షకుల హృదయాల తలుపులను తడుతూనే వున్నాయి .. మనసుకు మధురానుభూతుల రెక్కలను తగిలిస్తూనే వున్నాయి. అలాంటి విశ్వనాథ్ నుంచి వచ్చిన సందేశాత్మక చిత్రాల్లో ఒకటి ‘సప్తపది’.

Video Advertisement

సప్తపది చిత్రం లో గిరీశ్ ప్రధాన్, సబితా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం లో ఫ్లూట్ కళాకారునిగా మురళి పాత్రలో గిరీష్ రాణించి, ప్రేక్షకుల హృదయాల్లో నిలిచాడు. కర్ణాటకకు చెందిన గిరీష్ అసలు పేరు గిరీష్ ప్రధాన్. బీఎస్సీ చదివిన ఆయన సినిమాల మీద ఆసక్తితో ఫిలిం ఇనిస్టిట్యూట్ లో చేరి శిక్షణ పొందిన గిరీష్ కి తొలి చిత్రం కళాత్మక చిత్రం సప్తపది కావడంతో ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే వచ్చాయి. ఆ తర్వాత వంశి దర్శకత్వం లో ‘మంచు పల్లకి’ చిత్రం లో నటించారు గిరీష్.

did you remember this actor..

‘మంచుపల్లకి’ చిత్రం లో చిరంజీవి తో కలిసి నటించారు గిరీష్. ఆ సినిమా సమయం నుంచి వీరిద్దరి మధ్య స్నేహం బలపడింది. అప్పట్లో గిరీష్ ని గిరు అని పిలవడంతో .. చిరు అంటూ చిరంజీవిని పిలిచాడట. ఆ విధంగా చిరు అని మొదటిసారి పిలిచింది గిరీషే. ఇక గిరీష్ పుస్తకాలూ ఎక్కువగా చదువుతూ ఉంటాడని తెల్సుకున్న చిరంజీవి అప్పట్లో మద్రాసులో కడ్తున్న తన ఇంట్లో లైబ్రరీ డిజైన్ చేసే బాధ్యతను గిరీష్ కి అప్పగించాడు.

did you remember this actor..

చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కి షిఫ్ట్ అయినప్పుడు చెన్నైలోనే వుండిపోయిన గిరీష్ సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటూ.. తన ఫామిలీ ఫొటోస్ పంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం సినిమాలకు దూరం గా ఉన్న గిరీష్ చెన్నైలో ఫార్మా ఎక్స్ పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. గిరీష్ భార్య పేరు వీణా ప్రధాన్. వీరికి అమితాష్ ఒక్కడే కొడుకు. అమితాష్ ప్రస్తుతం నటుడిగా కొనసాగుతున్నారు. ధనుష్ హీరోగా నటించిన రఘువరన్ బిటెక్ లో కూల్ గా వుండే విలన్ పాత్రలో జీవించాడు. తెలుగులో కూడా బ్రూస్ లీ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా నటించాడు. హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించాడు అమితాష్.