తెలుగు పరిశ్రమ హైదరాబాద్ కి రాకముందు… కృష్ణ మాట్లాడిన ఈ స్పీచ్ చూసారా..?

తెలుగు పరిశ్రమ హైదరాబాద్ కి రాకముందు… కృష్ణ మాట్లాడిన ఈ స్పీచ్ చూసారా..?

by kavitha

Ads

స్వాతంత్ర్యం రాక ముందు నుండి తెలుగు తమిళ భాషలలో మొదటి చిత్రాలను నిర్మించినది తెలుగువాడు హెచ్.ఎమ్.రెడ్డి. బ్రిటీష్‌ హయంలోని ఉమ్మడి మద్రాసు పట్టణం, అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. దాంతో దక్షిణాది భాషల సినిమాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇక స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసులోనే ఉండేది.

Video Advertisement

కానీ కొందరు తెలుగు నటీనటులు తెలుగు రాష్ట్రంలోనే తమ పరిశ్రమ ఉండాలని చేసిన ఎన్నో ప్రయత్నాల తరువాత ఇండస్ట్రీ హైదరాబాద్ కు తరిలింపబడింది. అయితే ఇండస్ట్రీ హైదరాబాద్ కు రాకముందు కృష్ణ, ఏఎన్ఆర్ మాట్లాడిన ఒక వీడియో నెట్టింట్లో షికారు చేస్తోంది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం టాలీవుడ్ కి సినిమాలు తీయడానికి దాదాపుగా అన్ని విధాల సౌకర్యాలు ఇక్కడే ఉన్నాయి. కానీ ఒకప్పుడు సినిమా తియ్యలి అంటే మద్రాసుకి వెల్లవల్సిందే. అక్కడ ఎన్నో ఇబ్బందులు, అవమానాలు పడుతూ తెలుగువారు సినిమాలను చేసేవారు. అయితే ఎందరో చేసిన కృషి వల్ల ఇండస్ట్రీ హైదరాబాద్ కి రాగలిగింది. వారిలో ముఖ్యులు అక్కినేని నాగేశ్వర రావు, ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, సారధి, రామానాయుడు వంటివారు హైదరాబాద్ లో స్టూడియోలు నిర్మించారు.
1983 జనవరి లో ఎన్టీఆర్ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ హయాంలో తెలుగు సినీ ఇండస్ట్రీ చెన్నై నుండి హైదరాబాదుకు తీసుకురావడంలో డి.వి.యస్.రాజు కీలక పాత్ర వహించారు. ఆయన సినీ రంగానికి, అభివృద్ధికి కావలసిన అన్నీ సహాయసహకారాలు అందజేశారు. అలా వచ్చిన ఇండస్ట్రీని ఒకప్పుడు పరిగణలోకి తీసుకునేవారు కాదు. కానీ ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్ టాప్ ప్లేస్ లో ఉంది. తెలుగు ఇండస్ట్రీ  ప్రస్తుతం ఇండియాలో అత్యధిక సినిమాలను నిర్మించే ఇండస్ట్రీలలో ఒకటిగా ఉంది.తాజాగా సోషల్ మీడియాలో తెలుగు ఇండస్ట్రీ హైరాబాద్ కి రాకముందు హీరోలు కృష్ణ, ఏఎన్ఆర్ మాట్లాడిన వీడియో ఒకటి చకకర్లు కొడుతోంది. ఆ వీడియోలో కృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారిని తెలుగు సినీ పరిశ్రమని హైదరాబాద్ కి తీసుకురావాల్సిందిగా కోరారు. మీ హయాంలోనే ఇండస్ట్రీ ఇక్కడికి వస్తుందని ఆశిస్తున్నా అంటూ ముగించారు.
ఆ తరువాత ఏఎన్ఆర్ మాట్లాడుతూ 1963 నుండి తెలుగు పరిశ్రమని హైదరాబాద్ కి తీసుకురావడానికి కృషి జరుగుతోందని, కానీ ఇప్పటివరకు అది జరగలేదని, సీఎం ఎన్టీఆర్ సినీ ప్రపంచం నుండి వచ్చిన వారు కావడం వల్ల ఆయనను తెలుగు ఇండస్ట్రీ హైరాబాద్ కి తరలించాలని కోరడం సమంజసం అని, ఆయన సహకరించాలని అన్నారు.

watch video : 

Also Read: “ఏజెంట్” OTT రిలీజ్ లేట్ అవ్వడానికి కారణం ఇదేనా..?


End of Article

You may also like