“ఏజెంట్” OTT రిలీజ్ లేట్ అవ్వడానికి కారణం ఇదేనా..?

“ఏజెంట్” OTT రిలీజ్ లేట్ అవ్వడానికి కారణం ఇదేనా..?

by kavitha

Ads

యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన చిత్రం ఏజెంట్, ఇటీవల భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా సినిమాగా విడుదల కావాల్సింది. అయితే చివరి నిముషంలోతెలుగు మరియు తమిళంలోనే విడుదలయ్యింది. కానీ రెండు రాష్ట్రాలలో ఏజెంట్ చిత్రం తీవ్రంగా నిరాశపరిచిన విషయం అందరికి తెలిసిందే.

Video Advertisement

బాక్స్ అఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఏజెంట్ ఫలితాన్ని కాస్తా ముందుగా ఓటీటీలో విడుదల చేసి నష్టాన్ని కొద్దిగా తగ్గించుకోవాలని భావించారు. అయితే ఏజెంట్ చిత్రం విడుదల అయ్యి నెలరోజులు గడుస్తున్నా, ఇప్పటి దాకా ఓటీటీలో విడుదల కాలేదు. ఏజెంట్ ఆలస్యానికి కారణం గురించి ఒక టాక్ వినిపిస్తోంది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రం ఏజెంట్. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించాడు. ఈ చిత్రంలో మళయాల మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించగా, హీరోయిన్ గా సాక్షి వైద్య నటించింది. రిలీజ్ కు ముందు ట్రైలర్, టీజర్ లతో భారీ అంచనాలను క్రియేట్‌ చేసిన ఏజెంట్, థియేటర్లలో రిలీజ్ అయ్యాక పూర్తిగా నిరాశపర్చింది. ఈ చిత్రం ఏప్రిల్‌ 28న రిలీజ్ అయిన మొదటి షో నుండే డిజాస్టర్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ చిత్రం పెట్టిన బడ్జెట్ లో కనీసం 10 శాతం కూడా రికవరీ చేయలేకపోయింది.
ఏజెంట్ మూవీ డిజిటల్‌ రైట్స్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అయిన సోనీ లివ్ కొనుగోలు చేసింది. మే19 నుండి స్ట్రీమింగ్‌ చేయబోతునట్లు అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. కానీ ఆ రోజు స్ట్రీమింగ్ కాలేదు. దాని పై సోనీ లివ్ ” ప్రస్తుతం ఏజెంట్ సినిమా అందుబాటులో లేదని, త్వరలోనే స్ట్రీమింగ్ అవనుంది” అని ట్వీట్ చేసింది. సినీ వర్గాలలో వినిపిస్తున్న టాక్ ప్రకారం,  ఏజెంట్ రిలీజ్ కి 2,3 రోజుల ముందు కూడా ఎడిటింగ్ పని జరిగిందట.
మూవీ ఔట్ పుట్ ఎలావుందో సరిగ్గా చూడకుండానే విడుదల చేయడం వల్లే ఫలితం నిరాశపరిచింది. కనీసం ఓటీటీలో అయినా రీ ఎడిట్ చేసి కాస్త బెటర్ ఔట్ పుట్ ను రిలీజ్ చేస్తే మళ్ళీ ట్రోలింగ్ బారిన పడకుండా ఉండే ఛాన్స్ ఉంది. దాంతో ఈ మూవీని రీ ఎడిట్ చేసిన తరువాత ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు తాజాగా వినిపిస్తోంది. అయితే ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి మరి.

Also Read: ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన “నరసింహ నాయుడు” మూవీ రిలీజ్ టైం లో ఏం జరిగిందో తెలుసా..??

 


End of Article

You may also like