ఇప్పటి వరకు చూడని సూపర్ స్టార్ “కృష్ణ” గారి అరుదైన ఫోటోలు..!

ఇప్పటి వరకు చూడని సూపర్ స్టార్ “కృష్ణ” గారి అరుదైన ఫోటోలు..!

by Mohana Priya

Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో కొత్త విషయాలకి నాంది పలికిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. అప్పట్లో ప్రయోగాలు చేయడంలో కృష్ణ గారు ముందు ఉండేవారు. ఎన్నో కొత్త విషయాలని తెలుగు ఇండస్ట్రీలో ఆవిష్కరించారు. కొత్త రకమైన సినిమాలని కృష్ణ గారు చేసేవారు. కృష్ణ గారి అసలు పేరు ఘట్టమనేని శివ రామకృష్ణ మూర్తి. కృష్ణ గారిని సూపర్ స్టార్ కృష్ణ అని మాత్రమే కాకుండా, నటశేఖర కృష్ణ అని కూడా అంటారు. కృష్ణ గారు, పదండి ముందుకు, కుల గోత్రాలు, పరువు ప్రతిష్ట అనే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేశారు. అలా కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత తేనె మనసులు అనే సినిమాలో నటించారు.

Video Advertisement

krishna rare pictures

1965 లో వచ్చిన ఈ సినిమా కృష్ణ గారికి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. అప్పటి నుండి కృష్ణ గారు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వెళ్లారు. గూడచారి 116 సినిమాతో కృష్ణ తెలుగులో ఒక డిటెక్టివ్ సినిమా మొదటిగా చేశారు. ఆ తర్వాత ఇదే ఫార్మాట్ లో ఎన్నో వచ్చాయి. తెలుగులో కూడా గూడచారి అంటే గుర్తొచ్చేది కృష్ణ గారే. కృష్ణ గారి ఫిల్మోగ్రఫీ చూసుకుంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎన్నో రకమైన కొత్త ప్రయోగాలు చేశారు. కృష్ణ గారి తర్వాత, ఆయన కొడుకు రమేష్ బాబు గారు కూడా కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు, అంతే కాకుండా, కొన్ని సినిమాలకి నిర్మాతగా కూడా వ్యవహరించారు.

కృష్ణ గారి కూతురు మంజుల కూడా సినిమాల్లో నటించారు. డైరెక్టర్ గా కూడా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. కృష్ణ గారి కొడుకు మహేష్ బాబు హీరోగా రాణిస్తున్నారు. కృష్ణ గారి కూతురు పద్మిని ప్రియదర్శిని సినిమాలకి దూరంగా ఉంటారు. మరొక కూతురు పద్మావతి గారు కూడా సినిమాలకి దూరంగా ఉంటారు. కృష్ణ గారు ఇప్పుడు మన మధ్య లేకపోయినా కూడా ఆయన సినిమాలు రూపంలో మనతోనే ఉన్నారు. ఎన్నో కొత్త ప్రయోగాలకి స్ఫూర్తిని ఇచ్చేలాగా ఆయన సినిమాలు ఉంటాయి. అప్పట్లో కొత్త ప్రయోగాలు చేయాలి అంటే కృష్ణ గారు తన సినిమాల ద్వారా ఎంతో మందికి ధైర్యాన్ని ఇచ్చారు. కృష్ణ గారి కొన్ని అరుదైన ఫోటోలు ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15


End of Article

You may also like