ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఆరోగ్య సమస్యల కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. గ‌తేడాది కృష్ణ పెద్ద కుమారుడు ర‌మేష్ బాబు అనారోగ్యంతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా కృష్ణ మొద‌టి భార్య, మ‌హేశ్ బాబు త‌ల్లి ఇందిరా దేవి సైతం అనారోగ్యంతో క‌న్నుమూశారు.

Video Advertisement

ఇందిరాదేవి గారు చనిపోయిన కొద్ది రోజులకే కృష్ణ గారు కూడా చివరి శ్వాస విడిచారు. ఇప్పుడు వారి లైఫ్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.

famous personalities died in 2022

ప్రతీ ఒక్కరికీ కూడా కష్ట సుఖాలు ఉంటాయి. అయితే ఎప్పుడు లైఫ్ లో విజయం ఉంటుంది ఎప్పుడు ఫెయిల్యూర్ ఉంటుంది అనేది ఎవరూ ఊహించలేము. పెద్ద పెద్ద స్టార్స్ కి కూడా ఫెయిల్యూర్ ఉంటుంది. ఇది అందరి లైఫ్ లో కామన్ ఏ. అలానే సూపర్ స్టార్ కృష్ణ లైఫ్ లో కూడా ఫెయిల్యూర్స్ వున్నాయి. ఆయన కూడా ఆయన లైఫ్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డారట.

వరసగా 14 ప్లాప్స్ వచ్చాయి కృష్ణ కి. దీనితో దర్శక నిర్మాతలు ఎంతో టెన్షన్ పడ్డారట. సినిమాలు చెయ్యకుండా ఉండడం మంచిదని కొందరు అనేవారట. కొంత మంది నిర్మాతలైతే ఆయనకి కనపడకుండా తిరిగేవారట. కృష్ణ పాడిపంటలు సినిమా తో ఆయన ప్లాప్స్ కి చెక్ పెట్టేసారు. దీనితో మళ్ళీ కృష్ణ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపారు. కానీ ఆ సందర్భంలో కృష్ణ తన తో ఎవరు వున్నారు ఎవరు తనకి సహాయం చేసారు అనేవి తెలుసుకున్నారట. కానీ అన్ని ఫ్లాపులని ఎదుర్కోవడం నిజంగా ఎంతో కష్టం.