Ads
విడుదల కి ముందునుంచి “ఉప్పెన” పై భారీగానే అంచనాలు ఉన్నాయి. అసలు ఈ సినిమా గతేడాదే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ, కరోనా కారణం గా వాయిదా పడింది. అయితే.. లాక్ డౌన్ టైం నుంచి ఈ సినిమా ట్రెండింగ్ లోనే ఉంది. ఎలా అంటే.. వరుస గా గ్యాప్ ఇస్తూ పాటలను విడుదల చేసారు. ఈ పాటలు బాగా ఆకట్టుకోవడం తో ఈ సినిమా పై బాగా హైప్ వచ్చింది.
Video Advertisement

Uppena Heroine Krithi Shetty Images
దర్శకుడు సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు కావడం, మెగా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరో వైష్ణవ తేజ్, తొలి పాట తోనే కుర్రకారుని కట్టిపడేసిన హీరోయిన్ కృతి శెట్టి.. ఇలా ఈ సినిమా పై ఎక్స్ పెక్టేషన్స్ పెరగడానికి చాలానే కారణాలున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి కొంచెం హైప్ క్రియేట్ చేశాయి. సినిమాలో కూడా పాటలు అంతే బాగా పిక్చరైజ్ చేశారు. స్టొరీతో పాటు పాటలు కూడా అలా వెళ్లిపోతాయి. దేవి శ్రీ ప్రసాద్ ఉప్పెన సినిమాకి తెరవెనుక హీరో అని చెప్పొచ్చు.

uppena heroine Ranguladdhukunna song images 07
“నీ కళ్ళు నీలి సముద్రం” పాటతో కృతిశెట్టి ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. సినిమా రిలీజ్ కాకుండానే ఆమెకు పలు అవకాశాలు వచ్చాయి. అయితే, తొలుత ఈ సినిమాకి కృతి శెట్టిని తీసుకోవాలని అనుకోలేదట.

image credits: ragalahari
మొదట, ఈ సినిమా లో హీరోయిన్ గా నటించాల్సింది గా మనీషా రాజ్ ను సంప్రదించారట. అయితే ఆమె ఈ సినిమా ని రిజెక్ట్ చేసిందట. ఈమెకి టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు అందలేదు. మనీషా రాజ్ సునీల్ సినిమా “2 కంట్రీస్ ” హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాను మనీషా రాజ్ ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలియదు కానీ, కృతి శెట్టి కి మాత్రం అదృష్టం కలిసొచ్చింది. ఈ సినిమా వలన కృతి శెట్టి కి వరుస అవకాశాలు వస్తున్న సంగతి తెలిసిందే.
End of Article