ప్రభాస్ చెల్లెళ్ల గొప్ప మనసు…ఏం చేసారో తెలుస్తే ఫిదా అవుతారు..! రాజుగారి ఫామిలీ అంటే ఆ రేంజ్ ఉంటది.!

ప్రభాస్ చెల్లెళ్ల గొప్ప మనసు…ఏం చేసారో తెలుస్తే ఫిదా అవుతారు..! రాజుగారి ఫామిలీ అంటే ఆ రేంజ్ ఉంటది.!

by Megha Varna

Ads

కరోనా మహమ్మారి కారణంగా దేశమంతటా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసింది ..దీంతో దేశ ఆర్ధిక పరిస్థితి మరింత పడిపోయింది ..కాగా కరోనా మహమ్మారిని ఎదురుకొనేందుకు కేంద్ర ప్రభుత్వానికి చాలా నిధులు కావాలి .ఈ క్రమంలో అంబానీ, రతన్ టాటా లాంటి బడా వ్యాపారవేత్తలు పెద్ద మొత్తంలోప్రధానమంత్రి సహాయనిధికి ఇవ్వగా , హీరోలు హీరోయిన్లు సెలబ్రెటీలు ఇప్పటికే తమ వంతు సాయం చేసారు. అయితే ఇప్పుడు మాజీ కేంద్ర మంత్రి ,ప్రముఖ నటుడు , కృష్ణం రాజు ముగ్గురు కుమార్తెలు , యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చెల్లెలు ప్రదీప్తి ,ప్రసీద,ప్రకీర్తి ,ప్రధానమంత్రి సహాయ నిధికి తమ వంతు సాయం చేసారు.

Video Advertisement

కృష్ణం రాజు సతీమణి శ్యామలాదేవి పుట్టినరోజు సందర్భంగా నాలుగు లక్షల రూపాయలు ,అదే విధంగా వారి ముగ్గురు కుమార్తెలు తమ పాకెట్ మనీ నుంచి తలా రెండు లక్షల రూపాయలు… అంటే మొత్తంగా 10 లక్షల రూపాయలు ప్రధానమంత్రి కరోనా సహాయనిధికి విరాళంగా ఇచ్చారు . ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కరోనా ని అదుపు చేయడానికి చేస్తున్న కృషి , కట్టుదిట్టమైన నిర్ణయాలు మరియు ప్రధానమంత్రి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రసంగానికి ఇన్ స్పైర్ అయ్యి వ్యక్తిగతంగా మా సహాయం కూడా చెయ్యాలని మా పాకెట్ మనీ ని పిఎం కేర్ ప్రధానమంత్రి కరోనా సహాయ నిధికి ఇస్తున్నట్లు ప్రదీప్తి ,ప్రసీద ,ప్రకీర్తి వెల్లడించారు .

మోడీ గారు చెప్పినట్లుగా నడుచుకుంటూ వారి నిర్ణయాలకు గౌరవం ఇస్తూ దేశ ప్రజలందరూ కరోనా మహమ్మారి ని తరిమి కొట్టాలని అన్నారు . అందుకోసం దేశం అంతా ఒకే ఆలోచనతో వెళ్తుంది అని అంతా కలిసి ఉన్నాం అని మన ఐకమత్యతను చాటిచెప్పే విధంగా దేశమంతటా కొన్ని కార్యక్రమాలు చేప్పట్టిన మోడీ గారి ఆలోచనా విధానం అభినందనీయం అని తెలిపారు ..కాగా తన  జన్మదినం కావున నాలుగు లక్షల రూపాయలు ప్రధాన మంత్రి సహాయ నిధికి ఇస్తున్నట్లు శ్యామల దేవి ప్రకటించారు .

అయితే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే కేంద్ర కరోనా సహాయ నిధికి 3 కోట్ల రూపాయలు ప్రకటించగా ,ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు చెరో 50 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే ..ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో పనిచేసే వారు కరోనా లాక్ డౌన్ వలన పనులు లేకపోవడంతో వారికి 50 లక్షలు విరాళం ప్రకటించి రియల్ హీరో అనిపించుకున్నాడు . మొత్తంగా ప్రభాస్ 4 .5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడు .ఇది ఇలా ఉండగా కరోనా సహాయార్ధం విరాళాలు అందించిన కుటుంబాలలో కృష్ణం రాజు గారి కుటుంబమే మిగతా వారికంటే ముందుంది.

Also Read >>లాక్ డౌన్ లో పనిచేస్తున్న ఈ 10 డిపార్టుమెంట్స్ వారికి మనం థాంక్స్ చెప్పుకోవాలి.!


End of Article

You may also like