Ads
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అలియాస్ కేసీఆర్ .తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పరిచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి విజయం సాధించి తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే .కేసీఆర్ లో ఉన్న ఉద్యమ స్ఫూర్తికి పోరాట పటిమకు అందరు ప్రశంసల వర్షం కురిపించారు .జూన్ 2014 లో మొదటి సరిగా ముఖ్య మంత్రి బాధ్యతలు చేపట్టారు కేసీఆర్ .మొదటగా 1983 లో కేసీఆర్ తెలుగు దేశం పార్టీ నుండి పోటీ చెయ్యగా ఏ.మదన్ మోహన్ చేతిలో ఓటమి పాలయ్యారు. .తరవాత వరుసగా 1985 నుండి 1999 వరుకు నాలుగు సార్లు ఎంఎల్ఏ గా గెలుపొందారు .తరువాత ఎంపీ గా గెలుపొందారు. తర్వాత లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ మినిస్టర్ గా మన్మోహన్ సింగ్ కేబినెట్లో పనిచేసారు .రెండు సార్లు ఎంపీ గా గొలుపొందిన కెసిఆర్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఒకసారి పదివికి రాజీనామా చేసారు .
Video Advertisement
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన విషయం తెలిసిందే .కాగా తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాటంలో చాలా ఉద్యమ పాటలు రాసారు సీఎం కెసిఆర్ .కాగా కెసిఆర్ అవలీలగా తెలుగు ,ఇంగ్లీష్ ,హిందీ ,ఉర్దూ భాషలు మాట్లాడగలరు ..కెసిఆర్ స్వతహాగా రైతుగా 60 ఎకరాలలో కాప్సికం మరియు బంగాళాదుంపలు పండిస్తున్నారు ..ఇప్పటికే తెలంగాణ సీఎం గా పనిచేస్తూ రాష్ట్ర ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్తూ మంచి పేరు తెచ్చుకున్నారు ..
కాగా కెసిఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామరావు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజకీయ నాయకుడు. సిరిసిల్ల నియోజకవర్గం నుండి 2009లో ఎన్నికైన శాసనసభ సభ్యులు. సమాచార సాంకేతిక (ఐటీ), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, టెక్స్టైల్స్, ఎన్నారై అఫైర్స్ మంత్రిగా పనిచేసారు. ఈయన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమారుడు. ఈయనకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలలో ప్రావీణ్యం ఉంది.
2008లో తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు రెండేళ్లపాటు కరీంనగర్ లో చదువుకున్న రామారావు, హైదరాబాద్ లో పాఠశాల విద్యను పూర్తిచేశారు.1990-91 ఎస్ఎస్సీ, జీజీ స్కూల్, హైదరాబాద్.1991-93 ఇంటర్, విజ్ఞాన్ కాలేజీ, గుంటూరు.గుంటూరులోని విజ్ఞాన్‌లో ఇంటర్మీడియట్ పూర్తిచేసి హైదరాబాద్ వచ్చి మెడిసిన్ ఎంట్రెన్స్ రాసిన రామారావుకు కర్ణాటకలోని ఓ మెడికల్ కాలేజీలో సీటొచ్చింది. కానీ అది ఇష్టంలేక నిజాం కాలేజీలోని మైక్రోబయాలజీ డిగ్రీలో చేరారు. 1996-98 ఎమ్మెస్సీ, (బయోటెక్నాలజీ) పూణే యూనివర్సిటీ, ముంబాయి. అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ 1998-2000 ఎంబీఏ పూర్తిచేశారు. అనంతరం అమెరికాలోని ఇంట్రా ప్రైవేట్ కంపెనీలో ఐదేళ్ల పాటు ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఉద్యోగం చేశారు.
ఈ నేపథ్యంలో కేటిఆర్ ఎప్పుడు ట్విట్టర్ లో తన వ్యక్తిగత విషయాలను ఫోటోలను షేర్ చేస్తూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారు. కాగా ప్రజల సమస్యలను ట్వీట్ ద్వారా తెలుసుకొని రిప్లై మెసేజ్ కూడా ఇస్తూ స్పందించి సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారు .ఒక మంత్రి హోదాలో ఉండి ప్రజలకు ఇంతలా అందుబాటులో ఉండడంతో ప్రజల నుండి ప్రశంసలు పొందుతున్నారు .కాగా తాజాగా తన కాలేజీ డేస్ లో తీసుకున్న ఒక ఫోటో ను ట్విట్టర్ లో షేర్ చేసారు కేటీఆర్ .దీనిపై ఒక నెటిజన్ మీరు ఎందుకు సినిమాలలో ప్రయత్నించలేదు అని అడిగాడు .దానికి కేటీఆర్ నన్ను ఎవరు అడగలేదు అని నవ్వుతు బదులు ఇచ్చారు ..కాగా ఈ ఫోటో ఇప్పుడు నెట్లో వైరల్ అవుతుంది
End of Article