Ads
ఎట్టకేలకు ఎంతగానో ఎదురు చూసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.
Video Advertisement
ఇప్పటి వరకు రిలీజ్ పై ఎన్నో సందేహాలు నెలకొని ఉన్నాయి. అయితే.. ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల అవడంతో ఇంకా సందేహాలకు ఫుల్ స్టాప్ చెప్పి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఓ వైపు ఎన్టీఆర్, మరోవైపు రామ్ చరణ్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఇద్దరి పాత్రలపై చాలా సందేహాలు ఉన్నప్పటికీ.. సినిమా రిలీజ్ అయిన తరువాత ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఆర్ ఆర్ ఆర్ సినిమా హంగామానే నడుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. నాటు నాటు సాంగ్ తరువాత.. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది “కుమ్రం భీముడో” పాట.
అయితే.. ఈ పాట ఒరిజినల్ వేరే ఉందట. ఓ జానపద గీతానికి చెందిన ట్యూన్ లో పాదాలను మార్చేసి ఈ పాటని రాసుకున్నారట. తాజాగా “కుమ్రం భీముడో” పాటను కాపీ చేసారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. తెలంగాణ జానపద గీతమైన “మదనా సుందరి” పాటనే కొంచం మార్చేసి “కుమ్రం భీముడో” పాటని రాశారట. జానపద గీతాలలోని ఈ పాటని గద్దర్ పాడారు. ఆ తరువాత ఈ పాట “రేలా రే” అనే షో లో కూడా పాడారు. ఈ ఫోక్ సాంగ్ పై యు ట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ పాటని మీరు కూడా చూసేయండి.
Watch video:
End of Article