భోజనం బాలేదు అన్న “కీర్తి భట్” కి కుమారి ఆంటీ స్ట్రాంగ్ కౌంటర్..! ఏం అన్నారంటే..?

భోజనం బాలేదు అన్న “కీర్తి భట్” కి కుమారి ఆంటీ స్ట్రాంగ్ కౌంటర్..! ఏం అన్నారంటే..?

by Mohana Priya

Ads

ఇటీవల కీర్తి భట్ కుమారి ఆంటీ ఫుడ్ బాలేదు అంటూ మాట్లాడిన సంగతి తెలిసిందే. కుమారి ఆంటీ ఫుడ్ కి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. చాలా మంది కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్లి సినిమా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు కుమారి అంటే ఏకంగా టీవీలోనే కనిపిస్తున్నారు. ముందు ఈవెంట్స్ లో, ఇప్పుడు సీరియల్స్ లో కూడా వస్తున్నారు.

Video Advertisement

కేవలం ఒకే ఒక్క వీడియోతో చాలా ఫేమస్ అయిపోయారు. కానీ ఆ వీడియో పక్కన పెడితే, కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వెనుక చాలా కష్టం కూడా ఉంది. చాలా సంవత్సరాల నుండి ఈ ఫుడ్ స్టాల్ కుమారి ఆంటీ నడుపుతున్నారు. అయితే ఇప్పుడు ఇంత ఫేమస్ అవ్వడంతో, చాలా మంది సెలబ్రిటీలు కూడా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కి వెళ్తున్నారు.

keerthi bhat comments on kumari aunty

కీర్తి భట్ భర్త తనని కుమారి ఆంటీ స్టాల్ కి తీసుకెళ్లారు. అక్కడ కీర్తి భట్ భోజనం చేసి, ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నారు తనకి అర్థం కాలేదు అని అన్నారు. చికెన్ కర్రీ చాలా కారంగా ఉంది అని అన్నారు. అంతే కాకుండా, కుమారి ఆంటీ కంటే చికెన్ కర్రీ తానే బాగా చేస్తాను అని కూడా చెప్పారు. అయితే, ఎవరి అభిప్రాయం వారిది అని కూడా కీర్తి చెప్పారు. ఇప్పుడు కుమారి ఆంటీ ఈ విషయం మీద స్పందించారు. ఈ విషయంపై కుమారి ఆంటీ మాట్లాడుతూ, “కీర్తి భట్ షాప్ దగ్గరికి వచ్చిన రోజు నేను లేను. నేను ఆరోజు ఊరు వెళ్లడంతో అంకుల్, మా అన్నయ్య, వదిన వాళ్ళు ఉన్నారు. అప్పుడే కీర్తి భట్ వచ్చి తిన్నట్టు ఉన్నారు. మగవాళ్ళు వండిన దానికి ఆడవాళ్ళు వండిన దానికి తేడా ఉంటుంది కదా.”

“నేను ఎప్పుడూ ఒకరిని తక్కువ చేసి మాట్లాడను. కానీ ఎవరి టేస్ట్ వాళ్ళది. ఒకరికి నచ్చేది ఇంకొకరికి నచ్చదు. మంచిని అంగీకరించినప్పుడు చెడుని కూడా అంగీకరించాలి. వాళ్ళకి నచ్చలేదు అని అంటే అది వాళ్ళ అభిప్రాయం. నా గురించి చెడుగా చెప్పారు అనే కారణంతో వారిని తక్కువ చేయను. నా పని నాది. వాళ్ళ పని వాళ్ళది. వాళ్ళు నా గురించి చెడుగా మాట్లాడారు అని నేను వాళ్ల గురించి చెడుగా మాట్లాడడం అనేది గౌరవం కాదు. కీర్తి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను” అని కుమారి ఆంటీ చెప్పారు.” దాంతో కుమారి ఆంటీ ఇలాంటి పరిస్థితిని కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు అని అంటున్నారు.

ALSO READ : “రాధిక మర్చంట్” ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? “అనంత్ అంబానీ” కంటే ఎంత తక్కువ అంటే..?


End of Article

You may also like