ఇంత మంచి సినిమా చూసి ఎన్ని రోజులు అయ్యిందో..? ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించి మాట్లాడుకుంటున్నారు.!

ఇంత మంచి సినిమా చూసి ఎన్ని రోజులు అయ్యిందో..? ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించి మాట్లాడుకుంటున్నారు.!

by Mohana Priya

Ads

గత కొంత కాలం నుండి బాలీవుడ్ నుండి వచ్చే సినిమాల క్వాలిటీ తగ్గిపోతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. చేస్తే రీమేక్ సినిమాలు చేస్తున్నారు. లేదు అంటే యాక్షన్ సినిమాల్లోనే ఎప్పుడో పాత సినిమాల స్టోరీలు తీసుకొని చేస్తున్నారు. సొంతంగా సినిమాలు చేసినా కూడా కాన్సెప్ట్ బాగుండట్లేదు. ఎక్కడో కొన్ని సినిమాలు మాత్రమే మంచి సినిమాలు వస్తున్నాయి. బాలీవుడ్ నుంచి ఇలాంటి మంచి సినిమాలు వచ్చి చాలా కాలం అయ్యింది. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఒక మంచి సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు లాపతా లేడీస్. అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావ్ దీనికి దర్శకత్వం వహించారు.

Video Advertisement

laapataa ladies movie review telugu

అమీర్ ఖాన్, కిరణ్ రావ్, జ్యోతి దేశ్ పాండే ఈ సినిమాని నిర్మించారు. రామ్ సంపత్ సంగీత దర్శకత్వం వహించారు. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, దీపక్ (స్పర్ష్ శ్రీ వాస్తవ) ఫూల్ (నితాన్షి గోయెల్) అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లయ్యాక తనని ఇంటికి తీసుకురావాలి అని చెప్పి ఫూల్ తో కలిసి ట్రైన్ ఎక్కుతాడు. అత్తవారింటికి వెళ్లేంతవరకు నెత్తి మీద వేసుకున్న చీర కొంగు తీయకూడదు అని ఫూల్ కి చెప్తారు. అయితే అదే ట్రైన్ లో, అదే బెర్త్ లో ఫూల్ లాగానే రెడీ అయ్యి ఉన్న మరొక అమ్మాయి పుష్ప కుమారి (ప్రతిభా రంతా) ని చూసుకోకుండా దీపక్ ఇంటికి తీసుకెళ్ళి పోతాడు.

laapataa ladies movie review telugu

హారతి సమయంలో నుదుటన బొట్టు పెట్టడానికి చీర కొంగు నెత్తి మీద నుండి తీసినప్పుడు అక్కడ ఉన్నది వేరే అమ్మాయి అని వారికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా కథ. సినిమా మొత్తం గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఇలాంటి సినిమాల్లో నటన ఎంత బాగుంటే సినిమా అంత బాగా వస్తుంది. ఈ సినిమాలో నటీనటులు అందరూ కూడా చాలా బాగా నటించారు. డైరెక్టర్ కిరణ్ రావ్ ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. చాలా సీన్స్ సహజంగానే కామెడీ పుట్టిస్తాయి.

laapataa ladies movie review telugu

ఇంత కామెడీ వెనుక కూడా మంచి సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారు. బాలీవుడ్ నుండి ఇలాంటి సినిమాలు చాలా మంది మిస్ అవుతున్నారు. బాలీవుడ్ అంటే ఇలాంటి సినిమాలకి పెట్టింది పేరు. ఈ విషయాన్ని ఈ సినిమా మరొకసారి నిరూపించింది. కుటుంబం అంతా కలిసి హాయిగా చూసే సినిమా ఇది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. కామెడీ తో పాటు ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో బాగా చూపించారు.

ALSO READ : ఇంటర్ ఫలితాల గురించి ఈ పిల్లవాడు చెప్పిన వీడియో చూశారా..? ఇంత చిన్న వయసులో ఇన్ని తెలివితేటలు వచ్చాయా..?


End of Article

You may also like