Ads
ప్రస్తుతం సినిమాలకు ఎంత డిమాండ్ ఉందో, వెబ్ సిరీస్ కి కూడా అంతే డిమాండ్ ఉంది. ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నారు. తెలుగులో కూడా వెబ్ సిరీస్ కంటెంట్ కి కొదవలేదు.
Video Advertisement
అయితే వివిధ భాషల్లో వచ్చిన వెబ్ సిరీస్ ని కూడా తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తున్నారు. తెలుగులో వచ్చిన వెబ్ సిరీస్ కూడా మిగిలిన భాషల్లో డబ్ అయ్యి విడుదల అవుతున్నాయి. అలా ఇటీవల ఒక వెబ్ సిరీస్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ఆ సిరీస్ పేరు పోచర్. అమెజాన్ ప్రైమ్ లో ఇది విడుదల అయ్యింది. హిందీలో రూపొందించిన ఈ సిరీస్, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలో కూడా స్ట్రీమ్ అవుతోంది. నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దిబ్యేందు భట్టాచార్య, రంజితా మేనన్ ఇందులో ముఖ్య పాత్రల్లో నటించారు. ఢిల్లీ క్రైమ్ లాంటి వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించిన రిచి మెహతా దీనికి కూడా దర్శకత్వం వహించారు. ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా ఇది రూపొందించారు.
ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్ ఈ సిరీస్ కి సహనిర్మాతగా వ్యవహరించారు. ఇంక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, మాల (నిమిషా సాజయన్) ఒక ఫారెస్ట్ ఆఫీసర్. మాల తండ్రి ఒక వేటగాడు. తన తండ్రి చేసిన తప్పులని మాల సరిదిద్దాలి అనుకుంటుంది. అలాన్ (రోషన్ మాథ్యూ) ఒక నంబర్ క్రంచర్. టెలిఫోన్ రికార్డ్‌ల రీమ్‌ల సహాయంతో ఎన్నో కేసులని పరిష్కరిస్తూ ఉంటాడు. నీల్ (దిబ్యేందు భట్టాచార్య) వారి సీనియర్. నీల్ కి అనారోగ్య సమస్య ఉంటుంది.
అయినా సరే అది పట్టించుకోకుండా, సరైన మార్గంలో నడవటం ద్వారా వచ్చే ఎన్నో అడ్డంకులని అధిగమిస్తూ ఎదురు వెళ్తాడు. ఏనుగులతో జరిగిన వ్యాపారాలని వీళ్లు ఎలా ఆపగలిగారు అనేది కథ. అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ విడుదల అవ్వకముందే సుడాన్ ఫిలిం ఫెస్టివల్ లో దీన్ని ప్రదర్శించారు. అక్కడ ఈ సిరీస్ చూసిన వాళ్ళు అందరూ కూడా మెచ్చుకున్నారు. దాంతో ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో కూడా విడుదల చేశారు. సాధారణంగా నిజ జీవిత కథ ఆధారంగానే ఎక్కువ శాతం సిరీస్ రూపొందుతున్నాయి.
అయితే అవి ఎంత సహజంగా చూపించారు అనేది కూడా ప్రేక్షకులు గమనిస్తున్నారు. ఈ సిరీస్ లో చాలా విషయాలని కళ్ళకి కట్టినట్లుగా చూపించడం కోసం చాలా సీన్స్ నిజమైన అడవుల్లోనే చిత్రీకరించారు. చూస్తుంటే ఇది అర్థం అవుతోంది. అంతే కాకుండా ఈ సిరీస్ కుటుంబం అంతా కలిసి చూసే అంత సాధారణంగానే ఉంది. ఈ సిరీస్ మొత్తంగా 8 ఎపిసోడ్లు ఉన్నాయి. కానీ సిరీస్ అంత ఆసక్తికరంగా సాగుతుంది కాబట్టి ఒకసారి కూర్చుంటే 8 ఎపిసోడ్లు ఈజీగా అయిపోతాయి. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ సిరీస్ ఇదే అని చూసినవారు అంటున్నారు.
End of Article