Ads
సినిమాల్లో గుర్తింపు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి నటించిన సిరీస్ మిస్ పర్ఫెక్ట్ ఇవాళ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. బిగ్ బాస్ తెలుగు ద్వారా పేరు సంపాదించుకున్న అభిజిత్ ఇందులో హీరోగా నటించారు. అలాగే ఇంకా ఎంతో మంది ప్రముఖులు ఈ సిరీస్ లో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- వెబ్ సిరీస్ : మిస్ పర్ఫెక్ట్
- నటీనటులు : లావణ్య త్రిపాఠి, అభిజిత్ దుడ్డాల, అభిజ్ఞ వూతలూరు, ఝాన్సీ, హర్ష వర్ధన్, మహేష్ విట్టా, హర్ష్ రోషన్.
- నిర్మాత : సుప్రియ యార్లగడ్డ
- దర్శకత్వం : విశ్వక్ ఖండేరావు
- సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
- స్ట్రీమ్ అవుతున్న ప్లాట్‌ఫామ్: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
- ఎపిసోడ్స్ సంఖ్య : 8
- విడుదల తేదీ : ఫిబ్రవరి 2, 2024
స్టోరీ :
లావణ్య రావు (లావణ్య త్రిపాఠి), ఢిల్లీలో ఒక మేనేజ్‍మెంట్ కన్సల్టెంట్. తన ఉద్యోగంలో భాగంగా హైదరాబాద్ కి వస్తుంది. లావణ్య కి క్లీనింగ్ అంటే చాలా ఇష్టం. తను ఉన్న ప్రతి చోట శుభ్రంగా ఉండాలి అనుకుంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే లావణ్యకి ఓసిడి ఉంటుంది. లావణ్య ఇంట్లో పని చేసే మనిషి జ్యోతి (అభిజ్ఞ వూతలూరు). అదే అపార్ట్మెంట్ లో ఇంకొక ఫ్లాట్ లో ఉంటాడు రోహిత్ (అభిజిత్). లావణ్య హైదరాబాద్ లో ఉన్న తర్వాత కోవిడ్ కారణంగా లాక్ డౌన్ ఉంటుంది.
లావణ్య, రోహిత్ ఒకటే కంపెనీలో పని చేస్తూ ఉంటారు. కానీ ఇద్దరికీ పరిచయం ఉండదు. ఒక రకంగా లావణ్య రోహిత్ కి పై ఆఫీసర్ గా పని చేస్తూ ఉంటుంది. అయితే కోవిడ్ లాక్ డౌన్ కారణంగా జ్యోతి పనికి రాలేకపోతున్నాను అనే విషయాన్ని రోహిత్ కి చెప్పమని లావణ్యకి చెప్తుంది. దాంతో రోహిత్ ఫ్లాట్ కి వెళ్ళిన లావణ్య, అతని ఫ్లాట్ చిందరవందరగా ఉండడం చూసి క్లీన్ చేస్తుంది. ఇది చూసిన రోహిత్, లావణ్యని పని మనిషి అని అనుకుంటాడు.
అయితే నిజం చెబుదాం అని లావణ్య ఒకపక్క ప్రయత్నిస్తూనే, మరొక పక్కన లక్ష్మీ అనే పేరు మార్చుకొని రోహిత్ ఇంటికి వెళ్లి పనిచేస్తుంది. ఆ తర్వాత లక్ష్మితో రోహిత్ ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రోహిత్ కి నిజం తెలిసిందా? జ్యోతి ఏం చేసింది? లావణ్య అసలు విషయం చెప్పిందా? ఇదంతా తెలియాలి అంటే మీరు సిరీస్ చూడాల్సిందే.
రివ్యూ :
ఈమధ్య సినిమాలతో పాటు సమానంగా వెబ్ సిరీస్ కి డిమాండ్ పెరిగిపోయింది. కంటెంట్ బాగుంటే అందులో ఉన్న తారాగణంతో సంబంధం లేకుండా వెబ్ సిరీస్ కి మంచి ఆదరణ లభిస్తోంది. దాంతో పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు కూడా ఇలాంటి వెబ్ సిరీస్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇంక ఈ సిరీస్ విషయానికి వస్తే సరదాగా సాగిపోతుంది. ఎనిమిది ఎపిసోడ్లు ఉన్న సిరీస్ ని బోర్ కొట్టకుండా తీశారు. బ్రేక్ తీసుకోకుండా వరుసగా అన్ని ఎపిసోడ్లు చూసేయొచ్చు.
ఎపిసోడ్ రన్ టైం కూడా తక్కువగానే ఉంది. ఈ సిరీస్ కి దర్శకత్వం వహించిన విశ్వక్ అంతకుముందు స్కైలాబ్ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ సినిమా కూడా ఒక మంచి ప్రయోగాత్మక సినిమాగా నిలిచింది. లాక్ డౌన్ అనే బ్యాక్ డ్రాప్ తీసుకోవడం వల్ల లొకేషన్స్ ఎక్కువగా చూపించలేదు. లిమిటెడ్ లొకేషన్స్ లో బాగా తీశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ కొన్ని సీన్స్ మాత్రం అంత పెద్ద కొత్తగా ఏమీ అనిపించవు. కొన్ని చోట్ల కాస్త సాగదీసినట్టు అనిపిస్తాయి.
పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, నటీనటులు అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు చేశారు. లావణ్య త్రిపాఠి ఒక కొత్త పాత్రలో కనిపించారు. మిగిలిన వాళ్ళు అందరూ కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. అక్కడక్కడ కామెడీ వర్క్ అవుట్ అయ్యింది కానీ, అక్కడక్కడ అంత నవ్వు తెప్పించదు. ఈ సీన్స్ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- స్టోరీ పాయింట్
- నవ్వు తెప్పించే కొన్ని కామెడీ సీన్స్
- నిర్మాణ విలువలు
- స్టైలింగ్
మైనస్ పాయింట్స్:
- కొత్తదనం లేని కథనం
- కాస్త సాగదీసినట్టు అనిపించే కొన్ని సీన్స్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
పెద్ద కొత్త కథ ఏమి కాకపోయినా కూడా చూస్తున్న ప్రేక్షకులని బోర్ కొట్టకుండా కూర్చోబెడుతుంది. సరదాగా కొంచెం సేపు నవ్వుకుందాం అని అనుకునే వారికి ఈ సిరీస్ తప్పకుండా ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇటీవల వచ్చిన తెలుగు సిరీస్ లో ఒక మంచి కామెడీ సీరీస్ గా మిస్ పర్ఫెక్ట్ సిరీస్ నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : ఈ 8 మంది “తెలుగు” టాప్ హీరోలతో నటించిన… ఒకే ఒక్క “హీరోయిన్” ఎవరో తెలుసా.?
End of Article