లావణ్య త్రిపాఠి మిస్ చేసుకున్న ఈ ప్రభాస్ సినిమా ఏదో తెలుసా..?

లావణ్య త్రిపాఠి మిస్ చేసుకున్న ఈ ప్రభాస్ సినిమా ఏదో తెలుసా..?

by Mohana Priya

సలార్ సినిమాతో హిట్ కొట్టి తన స్టార్ డం ని మరొకసారి నిరూపించుకున్న హీరో ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమా షూటింగ్ పనిలో ఉన్నారు. అంతే కాకుండా మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ సినిమాలో కూడా నటిస్తున్నారు.

Video Advertisement

అయితే ప్రభాస్ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా చేయాల్సిన సందర్భం వచ్చింది అనే సంగతి చాలా మందికి తెలియదు ఏమో.

ప్రభాస్ ని పాన్-ఇండియన్ స్టార్ చేసిన సినిమా బాహుబలి సినిమా కోసం హీరోయిన్ల వేటలో రాజమౌళి మొదటిగా రాశి ఖన్నాని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల రాశి ఈ సినిమా రిజెక్ట్ చేశారు. అయితే తర్వాత లావణ్య త్రిపాఠిని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల లావణ్య త్రిపాఠి ఈ సినిమా చేయలేకపోయారు. బహుశా లావణ్య త్రిపాఠిని తమన్నా స్థానంలో అనుకొని ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ తమన్నా పోషించిన అవంతిక పాత్ర లావణ్య త్రిపాఠి చేసినా కూడా బాగానే ఉండేది ఏమో.

లావణ్య త్రిపాఠి కి స్టార్ హోదా తీసుకొచ్చేది. ప్రస్తుతం అయితే లావణ్య త్రిపాఠి మిస్ పర్ఫెక్ట్ అనే ఒక సిరీస్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవల ఒక ప్రకటన వచ్చింది. అంతే కాకుండా మరికొన్ని సినిమాలు, సిరీస్ కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. వాటి ప్రకటన కూడా త్వరలోనే వస్తుంది. మరొక పక్క, ప్రభాస్, రాజమౌళి ఇప్పటికే పాన్-ఇండియన్ సెలబ్రిటీలుగా మారిపోయారు. వీళ్ళ సినిమాలు అన్నీ ఎప్పుడు విడుదల అవుతాయా అని అంతర్జాతీయ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.


You may also like

Leave a Comment