“లియో” సెన్సార్ టాక్..! ఎన్ని కట్స్ పడ్డాయి అంటే..?

“లియో” సెన్సార్ టాక్..! ఎన్ని కట్స్ పడ్డాయి అంటే..?

by kavitha

Ads

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా,  లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా లియో. ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. ఈ మూవీ పైన దేశ వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా రిలీజ్ అయిన ఈ  సినిమా ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది.

Video Advertisement

విజయ్ కెరిర్ లోనే అత్యధిక బిజినెస్ చేసిన మూవీ లియో అని సమాచారం. మూవీ రిలీజ్ కాకముందే నాన్ థీయాట్రికల్, థీయాట్రికల్ హక్కుల ద్వారా ప్రొడ్యూసర్ కి 500 కోట్ల రూపాయల వరకు వచ్చాయని టాక్. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
విజయ్ దళపతి, లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన లియో సినిమా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, సంజయ్ దత్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్తోంది.
ఇక ట్రైలర్ చూసిన తరువాత ఈ మూవీ హాలివుడ్ మూవీ రీమేక్ అని కొందరు, లేదు తెలుగు మూవీకి రీమేక్ అని మరికొందరు నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసిందని మేకర్స్ ప్రకటించారు.
సెన్సార్ బోర్డు సభ్యులు ఈ మూవీకి 13 కట్స్ చెప్పినట్టుగా సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ తో స్పష్టత వచ్చింది. అందులో ఒకొక్క కట్ లో కొన్ని పదాలను మరియు కొన్ని సీన్లను కూడా ప్రస్తావించారు. సెన్సార్ మెంబర్స్ సూచనల మేరకు మొత్తం 47 సెకన్ల నిడివిని తగ్గించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: హెబ్బా పటేల్ నటించిన ఈ సినిమా చూశారా..? ఎలా ఉందంటే..?


End of Article

You may also like