మొదటి రోజు రికార్డు కలెక్షన్స్ సాధించిన లియో సినిమా..!

మొదటి రోజు రికార్డు కలెక్షన్స్ సాధించిన లియో సినిమా..!

by Mounika Singaluri

Ads

తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన లియో సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదల సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఎల్ సి యు నుండి వచ్చింది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు తన వండర్ఫుల్ డైరెక్షన్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు.

Video Advertisement

లోకేష్ కనకరాజు ముందు సినిమాలైన ఖైదీ విక్రమ్ కి తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. స్టార్ డైరెక్టర్ శంకర్ తర్వాత అలాంటి క్రేజ్ సంపాదించుకున్న తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు మాత్రమే. కేవలం లోకేష్ కనగరాజు సినిమా కోసమే థియేటర్ కు వెళ్తున్నారంటే అతిశయోక్తి కాదు.

leo movie review

ఇప్పుడు ఎక్కడ చూసినా లియో కలెక్షన్స్ గురించి టాక్ నడుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ఈ సినిమా రూ.145 కోట్లు కలెక్ట్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో లియో సినిమాకు రూ.16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో రూ.17 కోట్ల షేర్ కలెక్షన్స్ వస్తే బ్రేక్ ఈవెన్ అయినట్లే. ఇక లియో తమిళ్ నాడులో రూ.100 కోట్లు, కర్ణాటకలో రూ.15.50 కోట్లు, కేరళలో రూ.13.50 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.10 కోట్లు, ఓవర్సీస్ లో రూ.60 కోట్ల మార్కెట్ అయింది. దీంతో వరల్డ్ వైడ్ గా లియోకు రూ.215 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఇక లియో సినిమా రూ.216 కోట్ల షేర్, రూ.410 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బాక్సాఫీస్ పోటీకి సిద్ధమైంది. లియో సినిమా ప్రపంచవ్యాప్తంగా 2800 పైగా థియేటర్లో ఈ సినిమాకు సుమారు రూ.300 కోట్లు బడ్జెట్ అయినట్లు సమాచారం.

leo censor talk

ఇక వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ చూసుకుంటే…తెలుగు రాష్ట్రాల్లో లియో సినిమాకు ఫస్ట్ డే బుకింగ్స్ బట్టి రూ.17 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. తమిళనాడు రూ.32 కోట్లు, కేరళలో రూ.12.50 కోట్లు, కర్ణాటకలో రూ.14.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇలా ఇండియా మొత్తంలో రూ.80 కోట్లు గ్రాస్ రావచ్చని తెలిపారు. ఇక ఓవర్సీస్ తో కలిపితే వరల్డ్ వైడ్ గా రూ.145 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టే అవకాశం ఉందని అంచనా.

 

Also Read:“రవితేజ” నటించిన ఈ బయోపిక్ ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like