Ads
తెలుగు సినిమా పరిశ్రమకు పండుగలు సీజన్ ఎప్పుడు కూడా కాసుల వర్షం కురిపిస్తూ ఉంటుంది…
అందుకే ఏదైనా పండగ వస్తే చాలు పోటీపడి మరి సినిమాలు రిలీజ్ చేస్తుంటారు.
Video Advertisement
ఇప్పుడు దసరా పండుగ సీజన్ టైం వచ్చింది. తెలుగు బాక్సాఫీసును ఢీకొట్టడానికి ఏకంగా 5 చిత్రాలు బరిలో ఉన్నాయి. వాటిలో బాలకృష్ణ భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, దళపతి విజయ్ లియో మధ్య పోటీ ఢీ అంటే ఢీ అనే విధంగా ఉంది.
బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాకి మల్టీప్లెక్స్ లో రూ.250, సింగిల్ స్క్రీన్ లో రూ.175 రేటు ఉండగా, రవితేజ టైగర్ నాగేశ్వరరావుకు మల్టీప్లెక్స్ లో రూ.200, సింగిల్ స్క్రీన్ లో రూ.150 గా ఉంది. కానీ తమిళ్ డబ్బింగ్ చిత్రం లియో కి మాత్రం మల్టీప్లెక్స్ లో రూ.295, సింగిల్ స్క్రీన్ లో రూ.175 ధర చూపించడం ఆశ్చర్యంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే తెలుగు నాట లియోకి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం అవుతుంది.
ఈ రేట్లు చూసి సొంత తెలుగు సినిమాల కన్నా ఒక డబ్బింగ్ తమిళ్ చిత్రానికి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుగు సినిమా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన తెలుగు వాళ్ళు తమిళ్ సినిమాలని ఆదరించిన విధంగా… అక్కడ తమిళ్ వారు మన తెలుగు సినిమాలని ఆదరించరు… మన ప్రొడ్యూసర్లు కూడా తెలుగు సినిమాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా తమిళ్ సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
End of Article