“చెన్నకేశవ రెడ్డి” సినిమా గురించి చాలా మందికి తెలియని 10 విషయాలు ఇవే.! టబు స్థానంలో ఏ హీరోయిన్‌ని అనుకున్నారు అంటే?

ప్రస్తుతం ఇండస్ట్రీ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. అభిమాన హీరోల పుట్టిన రోజులకు, ప్రత్యేక రోజులకు వారి సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చెయ్యడం మనం చూస్తున్నాం. తాజాగా చెన్న కేశవ రెడ్డి సినిమా యిరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు.

ప్రెస్‌మీట్ పెట్టి మరీ రీ రిలీజ్ అనౌన్స్ చెయ్యడం మరో విశేషం. చాలా ఏరియాల్లో షోల కోసం నిర్మాతకి ఇంకా కాల్స్ వస్తూనే ఉన్నాయంటే క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత భారీ స్థాయిలో స్పెషల్ షోలు పడడం అనేది బాలయ్య క్రియేట్ చేసిన హిస్టరీ అనే చెప్పాలి..

lesser known facts about chenna kesava reddy
ఇటీవల కాలంలో మహేష్ బాబు ‘పోకిరి’, పవన్ కళ్యాణ్ ‘జల్సా’ సినిమాలు స్పెషల్ షోలు వేశారు. యూఎస్ స్పెషల్ షోల గ్రాస్‌లో ఆ రెండు సినిమాలనూ బీట్ చేసాడు బాలయ్య.

ఇప్పడు చెన్నకేశవ రెడ్డి సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెల్సుకుందాం..
#1 తెలుగు తెలుపు సాంగ్
రిలీజ్ డేట్ ముందే అనౌన్స్ చెయ్యడం తో మూవీ షూటింగ్ చాల ఫాస్ట్ గా కంప్లీట్ చేసారంట. తీరా మూవీ రిలీజ్ అయ్యాక ఒక సాంగ్ ఉంటే బావుంటుందని అప్పుడు ఈ ‘తెలుగు తెలుపు’ సాంగ్ యాడ్ చేసారంట.

lesser known facts about chenna kesava reddy
దీని కోసం కీరవాణి గారు వేరే సినిమా కోసం రెడీ చేసిన ట్యూన్ ని తీసుకొని పాట షూటింగ్ కంప్లీట్ చేసారంట.

#2 పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్

ఈ సినిమా కోసం కేవలం 10 రోజుల్లోనే డైలాగ్ అన్ని రాసి ఇచ్చారంట ఈ అన్నదమ్ములు.

lesser known facts about chenna kesava reddy
#3 బాలయ్య సోదరిగా లయ

హీరోయిన్ లయను దేవయాని పోషించిన చెల్లెలి పాత్ర కోసం అడిగారట. కానీ ఆ స్టార్ హీరో తో చెల్లెలి పాత్ర వెయ్యడం ఇష్టం లేదు అని లయ నో చెప్పేసారంట.

lesser known facts about chenna kesava reddy
#4 టబు పాత్రకు సౌందర్య

సీనియర్ బాలయ్యకు జోడిగా టబు పాత్రలో ముందు సౌందర్యను అడిగారట. కానీ అంత ఓల్డ్ పాత్ర చెయ్యను అని సౌందర్య రిజెక్ట్ చేసారంట.

lesser known facts about chenna kesava reddy
#5 బాలయ్య స్టాంట్స్

ఈ మూవీ లో చేజింగ్ సీన్ లో ఛాపర్ కి వేలాడే షాట్ డూప్ లేకుండా ఫస్ట్ షాట్ కే ఓకే చేసారంట బాలయ్య.

#6 బ్రహ్మానందం ట్రాక్

ఈ సినిమాలో అసలు సీమ శాస్త్రి ట్రాక్ ఏ లేదంట.. అప్పటికప్పుడు అనుకొని సెట్ లోనే ఈ ట్రాక్ రాసారంట.

#7 బీజీయం

ఈ మూవీ లో బాలయ్య వచ్చే సీన్ లలో వచ్చే శరభ బీజీయం వినాయక్ ఎదో సాంగ్ లో విని అదే కావాలని మణిశర్మని అడిగి పెట్టించుకున్నారంట.

lesser known facts about chenna kesava reddy
#8 బాలయ్య సతీమణి రివ్యూ

ఈ మూవీ చూసిన తర్వాత బాలయ్య సతీమణి వసుంధర వినాయక్ ని మెచ్చుకున్నారంట.” సినిమా చాల బాగా తీసావ్. ఈ మూవీ చేస్తున్నన్ని రోజులు ఆయన చాల హ్యాపీ గా ఉన్నారు” అని అన్నారంట వసుంధర.

lesser known facts about chenna kesava reddy
‘చెన్నకేశవ రెడ్డి’ స్పెషల్ షోల ద్వారా వచ్చిన మొత్తంలో మేజర్ అమౌంట్ బసవతారకం ఛారిటబుల్ ట్రస్టుకి, మిగతాది బెల్లంకొండకు సంబంధించిన మిగతా అసోసియేషన్లకు విరాళంగా ఇవ్వనున్నారు.