Ads
ప్రేమ చాలా మధురమైంది.. ప్రేమలో ఉన్నంత కాలం.. స్వర్గంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.. ప్రేమ కోసం ఏ చేయడానికైనా సిద్ధం అనేలా తయారు చేస్తుంది. ఒక్కసారి పీకల్లోతు ప్రేమలో మునిగితే చుట్టుపక్కల లోకంతో పనే ఉండదు.. కొందరికి అయితే ఆకలి వేయదు.. నిద్ర రాదు.. ఇలా ప్రేమ ఎంత హ్యాపీగా ఉంచుతుందో.. కానీ విఫలమైతే విషాదం నింపుతోంది.
Video Advertisement
అయితే కొందరు మాత్రం ప్రేమే జీవితం అనుకోని.. నచ్చిన వ్యక్తి దూరం పెడితే తట్టుకోలేక ఆత్మహత్యే గతి అనుకుంటున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని ముందే ముగించేసుకుంటున్నారు. అయితే ఇలా ప్రేమ కోసం, ప్రేమించిన వారి కోసం ప్రాణాలు తీసుకొనేవారు ఒక్క క్షణం తన తల్లిదండ్రులు, తోబుట్టువుల గురించి ఆలోచిస్తే వారికీ ఇంత బాధ ఉండదు కదా అంటుంది ఒక అమ్మాయి..
ప్రేమించిన అమ్మాయితో గొడవ అవ్వడం తో ఆత్మహత్య చేసుకున్న తన తమ్ముడి లా ఎవరు మారొద్దని.. తమ కుటుంబం లా ఎవరు బాధపడకూడదని కోరుకుంటోంది ఈ యువతి.. ఆమె వేదన ఏంటో ఆమె మాటల్లోనే విందాం..
” నా పేరు సత్య, మా ఇంట్లో నేను, అమ్మ, తమ్ముడు కళ్యాణ్ ఉండేవాళ్ళం. నాన్న మేము చిన్నగా ఉన్నప్పుడే మరణించడం తో అమ్మ కస్టపడి తమ్ముడ్ని, నన్ను పెంచింది. అందుకే నేను నా డిగ్రీ పూర్తి కాగానే ఒక ఉద్యోగం చేరిపోయాను. మా తమ్ముడు బాగా చదువుతాడు. వాడికి గ్రూప్స్ రాసి మంచి ఉద్యోగం సంపాదించాలని కోరిక ఉండేది. దానికి తగ్గట్టే కస్టపడి చదివే వాడు. దానికి నేను సహాయం చేస్తూ ఉండేదాన్ని. ఇలా మా జీవితం హ్యాపీ గా గడుస్తున్న సమయం లో ఒక సంఘటన జరిగింది.
మా తమ్ముడు కోచింగ్ తీసుకుంటున్న సెంటర్లోనే ఒక అమ్మాయితో పరిచయం అయ్యింది. ఇద్దరు ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు. ఆ అమ్మాయిని నాకు కూడా పరిచయం చేసాడు. ఏం జరిగినా కూడా చదువు మాత్రం నిర్లక్ష్యం చెయ్యలేదు. ఇంతలో గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా కస్టపడి చదవడం స్టార్ట్ చేసాడు కళ్యాణ్. అయితే ఒక విషయం లో నా తమ్ముడికి, వాడు ప్రేమించిన అమ్మాయికి చిన్న గొడవ జరిగింది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు.
ఇంతలో నాకు కళ్యాణ్ బిహేవియర్ లో మార్పు కనిపించి ఏమైంది అని అడిగా.. కానీ ఎక్సమ్ టెన్షన్ అంటూ మాట దాటేశాడు. నేను కూడా అదే నిజం అనుకున్నా.. కానీ అదే నేను చేసిన పెద్ద తప్పు.. కొన్ని రోజులకు కళ్యాణ్ తన రూమ్ లో ఫ్యాన్ కి ఉరేసుకున్నాడు. ఒక్కసారిగా అందరం షాక్ అయిపోయాం. నేను, అమ్మ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాం. ఆ తర్వాత నాకు వాడి పరిస్థితి గురించి తెలిసింది.
చిన్న గొడవని.. పెద్దగా ఊహించుకొని ఆ అమ్మాయిని దూరం చేసుకొని చివరికి క్షణికావేశం లో జీవితాన్ని కోల్పోయాడు కళ్యాణ్. కానీ చిన్నప్పటి నుంచి తోడుగా ఉన్న అక్క, మా మీదే ప్రాణాలు పెట్టుకున్న అమ్మ, అలాగే తాను ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచించకుండా ప్రాణాలు తీసుకున్నాడు. ఒక్కసారైనా నాతో కానీ, లేదా వాడు ప్రేమించిన అమ్మాయితో కానీ మనసు విప్పి మాట్లాడి ఉంటే ఇప్పుడు మాకు ఇంత శోకం ఉండేది కాదు.
ప్రతి బంధం లో గొడవలు అనేవి ఉంటాయి. కానీ వాటిని ఎంతవరకు తీసుకోవాలి.. వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అన్న దానిపై మన వివేకం ఆధార పది ఉంటుంది. ఎంతో తెలివిగల వాడు అనుకున్నా నా తమ్ముడు ఇంత తెలివితక్కువ పని చేసి మా అందరికి ఇంత బాధని మిగిల్చాడు. నాలాగా ఇంకొకరు బాధపడకూడదు అని నేను కోరుకుంటున్నాను.” అని ఆ యువతి తన జీవితం లో జరిగిన విషాదం గురించి పంచుకుంది.
బిడ్లలను తల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచుకొని ఉంటారు. తీరా ఆ తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన సమయంలో.. యువత ఆత్మహత్య చేసుకోవడం విష్మయం కలిగిస్తోంది. ఒక్కసారి ఇలాంటి ఆత్మహత్యలు చేసుకునే ముందు యువత ఒకసారి ఆలోచించుకోవాలి.. వారి మీద కుటుంబాలు ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోవాలి. తమని నమ్ముకొని ఒక కుటంబం ఉందని గుర్తుంచుకోవాలి.
End of Article