ఆ ఎన్టీఆర్ సినిమాకి…హలో బ్రదర్ సినిమాకి మధ్య ఉన్న లింక్ ఏంటో మీకు తెలుసా.?

ఆ ఎన్టీఆర్ సినిమాకి…హలో బ్రదర్ సినిమాకి మధ్య ఉన్న లింక్ ఏంటో మీకు తెలుసా.?

by Megha Varna

Ads

ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన హలో బ్రదర్ సినిమా నాగార్జునకి మంచి హిట్ ని అందించింది. ఆ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేశారు. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఒకే లక్షణాలు ఉండి ఏకకాలంలో ఒకేలాగ ప్రవర్తించే కవలల కధ ఆధారంగా దీనిని రూపొందించడం జరిగింది.

Video Advertisement

అయితే షూటింగ్ సమయంలో నాగార్జున సైతం ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకం లేదని డైరెక్ట్ గా దర్శకుడు ముందే అనేవారట.

కానీ ఈ సినిమా మంచి హిట్ ని దక్కించుకుంది. అలానే హలో బ్రదర్ కి సీనియర్ ఎన్టీఆర్ అగ్గి పిడుగుకి కూడా ఒక సంబంధం ఉంది.  అదేమిటంటే అగ్గిపిడుగు చిత్రం లో ఎన్టీఆర్ సియామి ట్విన్స్‌గా నటించారు. ఆ సినిమాలో కూడా ఇద్దరు రామారావులు ఉన్నారు.

Also Read:   హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకునే విషయంలో…రవితేజ ఎందుకు ఇలా చేస్తున్నారు?

ఆ సినిమా కథను ప్రేరణగా తీసుకుని హలో బ్రదర్ తెరకెక్కించారు ఈవివి సత్యనారాయణ. పైగా అగ్గి పిడుగు సినిమా కూడా మంచి హిట్ ని అందుకుంది. సినిమా విడుదలైన తొలి వారం రోజుల్లోనే ఈ చిత్రం ఐదు లక్షలని వసూళ్లు రాబట్టింది.

Also Read: ఇతర హీరోల ఈవెంట్స్‌లో … వారినే “డామినేట్” చేసిన 10 స్టార్ హీరోస్..!


End of Article

You may also like